ఇటీవల కాలంలో చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామందిని వేధిస్తున్న సమస్యలలో తెల్లజుట్టు సమస్య కూడా ఒకటి. చిన్న వయసు వారు కూడా ఈ తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా 12 ఏళ్ల లోపు పిల్లల నుంచే ఈ సమస్య మొదలవుతోంది. తెల్ల జుట్టు కారణంగా చిన్న వయసులోనే పెద్ద వారిలా కనిపిస్తున్నారు. దాంతో చిన్న వయసులోని తలకు రంగులు వేసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. అయితే రంగు కేవలం తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. ఇకపోతే చాలామంది తెల్ల జుట్టు సమస్య కోసం మెంతులు ఉపయోగిస్తూ ఉంటారు. మెంతులతో పాటుగా ఇప్పుడు చెప్పబోయే పదార్థం ఉపయోగిస్తే తెల్ల జుట్టు సమస్య నుంచి చాలా వరకు బయటపడవచ్చు అని చెబుతున్నారు.
మరి మెంతులతో పాటు ఏ పదార్థం కలిగి రాయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మీ ఇంట్లో మెంతులు, నల్ల జీలకర్ర ఈ రెండూ ఉంటే చాలు. రెండు కలిపి రాస్తే తెల్ల జుట్టు నల్లగా మారుతుందట. మెంతులు, కళోంజీ గింజలను జుట్టుకు అప్లై చేయడం వల్ల కచ్చితంగా జుట్టు చాలా ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుందని, చాలా తక్కువ సమయంలోనే మంచి ఫలితం కనిపిస్తుందని చెబుతున్నారు. ఎక్కువ మంది ఫేస్ చేసే సమస్య జుట్టు రాలడం. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా, బలమైన ఆహారం తీసుకున్నా కూడా జుట్టు విపరీతంగా రాలిపోతూ ఉంటుందట. అలాంటి వారు కూడా ఈ మెంతులు, కళోంజీ గింజల మిశ్రమాన్ని జుట్టుకు రాయడం వల్ల జట్టు రాలడం ఆగిపోతుందట.
కొత్త జుట్టు కూడా వస్తుంది కాబట్టి మళ్లీ జుట్టు ఒత్తుగా మారుతుందట. పొడి జుట్టు సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ రెండు గింజల మిశ్రమాన్ని జుట్టుకు రాస్తే తల చాలా మాయిశ్చరైజ్డ్ గా మారుతుందట. కుదుళ్లకు అందాల్సిన న్యూట్రిషన్స్ అన్నీ అందుతాయట. డ్రై హెయిర్ సమస్య అనేది ఉండనే ఉండదు. అంతేకాదు జుట్టును బలంగా కూడా మారుస్తుందట. ప్రస్తుతం తెల్ల జుట్టు సమస్య చిన్న పిల్లల్లో కూడా కనిపిస్తోంది. 30 దాటిన వారిలోనూ విపరీతంగా తెల్ల వెంట్రుకలు వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి వారు ఈ రెండు గింజల మిశ్రమాన్ని వాడితే తెల్ల వెంట్రుకల సమస్య ఉండదట. తెల్ల జుట్టు కూడా నల్లగా మారడం పక్కా కొత్తగా తెల్లగా మారేవి కూడా మారకుండా నల్లగానే ఉంటాయట. ఎక్కువ కాలం మీ గ్రెయిర్ సమస్యను కంట్రోల్ చేయవచ్చని చెబుతున్నారు.
మొదట కొబ్బరి నూనె తీసుకొని ఒక పాత్రలో వేసి వేడి చేయాలి. అందులోనే మెంతులు, నల్ల జీలకర్ర సీడ్స్ కూడా వేసి బాగా మరగనివ్వాలి. కొబ్బరి నూనె రంగు మారే వరకు మరగనివ్వాలి. ఆ తర్వాత వేడి చేయడం ఆపేసి ఆ నూనె ఆరే వరకు ఆగాలి. ఇప్పుడు ఆ నూనెను తలకు బాగా పట్టించాలి. మంచిగా మసాజ్ చేయాలి. 30 నిమిషాల తర్వాత తలస్నానం కూడా చేయవచ్చట. లేదంటే రాత్రిపూట తలకు అప్లై చేసి మరుసటి రోజు అయినా తలస్నానం చేసిన సరిపోతుందని చెబుతున్నారు. వారానికి రెండు సార్లు అయినా ఈ నూనెను తలకు పట్టించడం వల్ల తెల్ల జుట్టు సమస్యకు పూర్తిగా చెక్ పెట్టవచ్చట.