Honey: స్త్రీ, పురుషులు అందంగా కనిపించాలంటే ఇది రాస్తే చాలు?

  • Written By:
  • Publish Date - March 11, 2024 / 04:07 PM IST

సాధారణంగా చలికాలంలో చర్మం పొడిబారిపోవడం అన్నది సహజం. అయితే కొందరికి వేసవిలో కూడా చర్మం డ్రై గా అయిపోయి పగుళ్లు ఏర్పడటంతో పాటు చర్మం నిర్జీవంగా మారుతుంది. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంల్ల ప్రతి మనిషి చర్మాన్ని రక్షించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తారు. అయితే తేనెను వాడటం వల్ల మంచి ఫలితాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి తేనెను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ముఖానికి తేనెను రాసుకోవడం వల్ల చర్మం కాంతివంతమవుతుంది. శరీరానికి ఎటువంటి హాని చేయదు.

బలాన్ని పెంచడంతోపాటు చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. రాత్రిపూట ముఖానికి తేనె రాయడంవల్ల మెరుపు వస్తుంది. చర్మం రంగు క్రమంగా క్లియరవుతుంది. రాత్రి సమయంలో పడుకొనే ముందు ముఖంపై పేరుకున్న మురికి, ఆయిల్ శుభ్రపడుతుంది. బ్లాక్ హెడ్స్, మొటిమలు తొలగిపోతాయి. ముఖ సౌందర్యం చాలా బాగుంటుంది. రాత్రివేళ నిద్రించేముందు ముఖానికి తేనె రాసుకోవడం వల్ల చర్మం పొడిబారదు. ముఖం కూడా ప్రకాశంతంగా మెరుస్తుంది. చర్మానికి సంబంధించిన సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి.

ప్రతిరోజు తేనెను పెదాలకు, ముఖానికి రాయడంవల్ల పొడిబారడం అనే సమస్య శాశ్వతంగా పోతుంది. కేవలం అందానికి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలామంచిది. ఉదయం వేడి నీటిలో ఒక స్పూన్ తేనె వేసుకొని తాగడంవల్ల మంచి ఫలితాలు ఉన్నాయట. అలాగే తేనెను తరచుగా ఉపయోగించడం వల్ల అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చు..