Site icon HashtagU Telugu

Black Thread On Leg: కాళ్ళకి నల్ల దారం ఎందుకు కడుతారు.. ఈ దారం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి?

Black Thread

Black Thread

ఒకప్పుడు అమ్మాయిలు ఎంతో అందంగా కనిపించడం కోసం కాళ్లకు పట్టీలు వేసుకొని ఇంట్లో నడుస్తూ ఉంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంట్లో నడుస్తుందనే భావన అందరిలోనూ కలిగేది. ఈ క్రమంలోనే అప్పట్లో ప్రతి ఒక్కరూ కాళ్లకు పట్టీలు ధరించేవారు. అయితే యువత ఫ్యాషన్ మాయలోపడి ప్రస్తుత కాలంలో పట్టిలు ధరించడం లేదు. కాళ్లకు పట్టీలు బదులు ప్రతి ఒక్కరూ నలుపు దారం కట్టుకొని ఉండటం మనం చూస్తుంటాము. ఇలా కాళ్లకు నల్ల దారం కట్టుకోవడం ప్రస్తుతం ఫ్యాషన్ అయిపోయింది.

ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న ఈ ఫ్యాషన్ ను దృష్టిలో పెట్టుకొని కొందరు ఈ నల్ల దారానికి మరిన్ని మెరుగులు దిద్దుతూ కొత్త కొత్త డిజైన్లను మార్కెట్లోకి తీసుకువస్తూ పెద్ద ఎత్తున బిజినెస్ లు కూడా చేస్తున్నారు. ఇలా విభిన్న డిజైన్లతో తయారైన నలుపు దారాలను కాళ్లకు కట్టుకుంటున్నారు. అయితే ఇలా నలుపు రంగు దారాన్ని కాళ్ళకి కట్టుకోవడం కేవలం ఫ్యాషన్ అని అనుకుంటే మాత్రం చాలా పొరపాటు పడినట్లే. ఇలా కాలికి నల్ల దారం కట్టుకోవడం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

నలుపురంగు ప్రతికూల శక్తిని మన నుంచి పారద్రోలుతుంది. అందుకే పూర్వకాలంలో మన పెద్దవారు ఎక్కువగా నలుపు రంగు వస్తువులను ఉపయోగించేవారు. చిన్నపిల్లలకు దిష్టి తగలకుండా నుదుటిపై కాటుక బొట్టు పెట్టేవారు. అలాగే మెడలో నల్లటి దారానికి దిష్టి పూసలు వేసేవారు. ఇకపోతే ప్రస్తుత కాలంలో కూడా చాలామంది బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా నలుపు రంగు బొట్టు పెట్టుకొని వెళ్ళటం వల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని భావిస్తారు.

ఈ క్రమంలోనే కాలికి నలుపు రంగు దారం కట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావం మనపై పడకుండా ఉండటమే కాకుండా మన శరీరంలో జీవ క్రియలు సక్రమంగా జరుగుతూ శరీర బరువు తగ్గే ఆస్కారం కూడా ఉంటుంది. మన శరీర బరువు తగ్గితే ఊబకాయం వంటి సమస్యలకు దూరం కావచ్చు. అందుకే నలుపు రంగు దారం కాలికి కట్టుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అదేవిధంగా అబ్బాయిలు నడుముకి మొలతాడు నలుపు దారాన్ని కట్టుకుంటారు. ఇలా నడుముకు ఈ దారం కట్టుకోవడం వల్లపొట్ట పెరగకుండా నడుం పరిమాణాన్ని తగ్గించడమే కాకుండా వెన్నునొప్పి సమస్యను కూడా దూరం చేస్తుందని చెబుతారు.