Site icon HashtagU Telugu

Green Clay: గ్రీన్ క్లే మాస్క్ వాడితే నిజంగానే మొటిమలు, మచ్చలు తగ్గుతాయా.. ఇందులో నిజమెంత?

Mixcollage 12 Feb 2024 09 43 Pm 7158

Mixcollage 12 Feb 2024 09 43 Pm 7158

ఈ మధ్యకాలంలో గ్రీన్ క్లే మాస్క్, గ్రీన్ స్టిక్ అని ఫుల్ పాపులర్ అవుతున్న మాస్క్‌ని ఉపయోగించేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నిజంగా దీనిని వాడితే లాభాలు ఉంటాయా. ఎలాంటి చర్మ సమస్యలు ఉన్నవారు ఈ క్లే మాస్క్ వాడచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా ఈ క్లే మాస్క్ అంటేనే చర్మానికి చాలా మంచిది. దీనిని వాడడం వల్ల చర్మంపై ఉన్న చాలా సమస్యలు దూరమవుతాయి. అందులో ఈ గ్రీన్ క్లే మాస్క్ కూడా ఒకటి. దీనిని వాడడం వల్ల చర్మంపై ఉన్న మురికి, టాక్సిన్స్ దూరమైపోతాయి. ఇక మొటిమలు, మచ్చలు తగ్గడానికి కూడా చాలా మంచిది. చర్మానికి తరచుగా ఎక్స్‌ఫోలియేషన్ చేయడం మంచిది.

దీని వల్ల చర్మంపూ ఉన్న నూనె ఉత్పత్తి తగ్గుతుంది. జిడ్డు చర్మం, మొటిమలు వంటి సమస్యలు ఉన్నవారు ఈ క్లే మాస్క్ వాడడం చాలా మంచిది. గ్రీన్ క్లే మాస్క్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. దీనిని వాడడం వల్ల చర్మ వాపు తగ్గించి తాజాగా కనిపించేలా చేస్తుంది. చాలా మందికి ముడతలు, వలయాలు వంటి సమస్యలు ఉంటాయి. ఈ మాస్క్ వాడడం వల్ల చాలా వరకూ ఆ సమస్యలు తగ్గి చర్మం తాజాగా యవ్వనంగా మారుతుంది. చర్మం కాంతివంతంగా మార్చడంలో గ్రీన్ క్లే మాస్క్ హెల్ప్ చేస్తుంది. దీనిని రెగ్యులర్‌గటా వాడితే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. పడుకునే ముందు ఈ మాస్క్ వాడడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి.

గ్రీన్ క్లే అనేది ఒక సహజ మాయిశ్చరైజర్. దీనిని వాడడం వల్ల ముఖం హైడ్రేట్ అవుతుంది. చర్మం మృదువుగా కూడా మారుతుంది. రెగ్యులర్‌గా వాడడం మంచిది. గ్రీన్ క్లే అనేది నేచురల్ సన్‌స్క్రీన్. దీన్ని రోజూ వాడడం వల్ల మీ చర్మాన్ని యూవీ రేస్ నుంచి కాపాడుకోవచ్చు. సో, రెగ్యులర్‌గా వాడితే చాలా లాభాలు ఉన్నాయి. కాబట్టి, హ్యాపీగా వాడవచ్చు. ఈ గ్రీన్ క్లే మాస్క్‌ని వాడిత అలర్జీల సమస్య చాలా వరకూ తగ్గుతుంది. దీని వల్ల హ్యాపీగా దీనిని వాడుకోవచ్చు. అయితే, ముందుగా చర్మాన్ని క్లీన్ చేసుకుని వాడాలి.

Exit mobile version