Basil seeds: తులసి ఆకులే కాదు.. గింజలు కూడా ప్ర‌యోజ‌న‌మే..!

మన దేశంలో ప్రతి ఇంటి ముందు తులసి కోట ఉంటుంది. ఈ తుల‌సి కోట‌కు మ‌హిళ‌లు పూజ చేస్తుంటారు. దైవంగా కొలిచే తులసి ఆకులో ఎన్నో ఔషదగుణాలు ఉన్నాయో మ‌న‌కు తెలిసిందే.

  • Written By:
  • Publish Date - October 15, 2022 / 10:15 AM IST

మన దేశంలో ప్రతి ఇంటి ముందు తులసి కోట ఉంటుంది. ఈ తుల‌సి కోట‌కు మ‌హిళ‌లు పూజ చేస్తుంటారు. దైవంగా కొలిచే తులసి ఆకులో ఎన్నో ఔషదగుణాలు ఉన్నాయో మ‌న‌కు తెలిసిందే. అయితే తులసి ఆకులే కాదు గింజలు కూడా మనకు ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ఐరన్, ప్రోటీన్లు పుష్కలంగా ల‌భిస్తాయి. అయితే ఈ గింజలను ప్ర‌తిరోజు మ‌నం తీసుకోవ‌డం వ‌ల‌న‌ ఎలాంటి ప్రయోజనాలను పొందుతామో ఇప్పుడు తెలుసుకుందాం.

తులసి గింజలు మ‌న శ‌రీరంలో ఇమ్యూనిటీ పవర్‌ను పెంచడానికి ఎంతో దోహ‌దం చేస్తాయి. అయితే ఇమ్యూనిటీ ప‌వ‌ర్ కోసం తులసి గింజల కాషాయాన్ని తాగాల్సి ఉంటుంది. అంతేకాకుండా.. మలబద్దకం, గ్యాస్ సమస్యల నుంచి రిలీఫ్ పొంద‌టానికి కూడా తులసి గింజలు మ‌న‌కు ఎంతో ఉప‌యోగప‌డ‌తాయి. తులసి గింజలను నీళ్లలో నానబెట్టి తాగితే జీర్ణసమస్యలు కూడా ద‌రిచేర‌వు.

మ‌న శ‌రీర‌ బరువును కంట్రోల్‌లో ఉంచ‌టానికి కూడా తులసి గింజలు యూజ్ అవుతాయి. శ‌రీర‌ బరువును తగ్గించడానికి సహాయపడతాయి. ఈ గింజల్లో కేలరీలు ఎక్కువ‌గా ఉండ‌వు. వీటిని తిన‌ప్పుడు మ‌న‌ కడుపు ఎక్కువసేపు నిండిన‌ట్లు ఉంటుంది. దాని వ‌ల‌న ఆక‌లి అనిపించ‌దు. తులసి గింజలు ఒత్తిడి, డిప్రెషన్, ఇత‌ర‌ మానసిక సమస్యలను తగ్గించడంలో బాగా పనిచేస్తాయి. తులసి గింజలను తీసుకోవడం వల్ల హార్ట్ ఎటాక్ ప్రమాదం తగ్గతుందని ఓ పరిశోధన వెల్లడించింది. ఈ గింజలు గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా చాలావ‌ర‌కు తగ్గిస్తాయి. క్యాన్సర్ కణాలు పెరగకుండా ఇవి అడ్డుకుంటాయి. ఈ గింజలు వయసు మీద పడుతున్న వచ్చే ముడతలను కూడా తగ్గిస్తాయని తెలుస్తోంది.