Helath Tips : భోజనం ముగిశాక పెరుగు లేకుంటే చాలా మందికి కడుపు నిండదు. మరికొందరు పెరుగు కాకపోతే మజ్జిగ తాగుతారు. పెరుగు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పెరుగు తినడం వల్ల కాల్షియం, విటమిన్ డి , విటమిన్ బి12 శరీరానికి సమృద్ధిగా అందుతాయి. అయితే రాత్రిపూట పెరుగు తినడం మంచిదా చెడ్డదా అని ఆలోచించారా?
రాత్రి సమయంలో, శరీరంలోని జీవక్రియ మందగిస్తుంది. ఇలాంటి సమయాల్లో జీర్ణ సమస్యలు ఉన్నవారు పెరుగు తింటే సమస్యలు పెరిగే అవకాశం ఉంది. పెరుగులో కొవ్వు , ప్రోటీన్లు ఉంటాయి. ఇవి జీర్ణం కావడానికి సమయం పడుతుంది. కాబట్టి జీర్ణ సమస్యలున్నవారు రాత్రిపూట పెరుగు తింటే సమస్యలు పెరుగుతాయి. కాబట్టి జీర్ణ సమస్యలు ఉన్నవారు రాత్రిపూట పెరుగు తినకూడదు. దగ్గు, జలుబు, ఆస్తమాతో బాధపడేవారు రాత్రిపూట పెరుగు తింటే అధ్వాన్నంగా ఉంటుంది. కాబట్టి రాత్రిపూట పెరుగు తినకపోవడమే మంచిది.
Dalai Lama : దలైలామా వారసత్వంపై ఉత్కంఠ
పెరుగును ఉదయం లేదా మధ్యాహ్నం తినవచ్చు. ఈ సమయంలో పెరుగు తింటే తేలికగా జీర్ణమవుతుంది. కానీ శ్వాసకోశ సమస్యలు లేని వారు రాత్రిపూట పెరుగు తినవచ్చు. కానీ జీర్ణ సమస్యలుంటే మాత్రం తినకూడదు. ఎలాంటి సమస్య లేని వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెరుగు తినవచ్చు. కానీ పెరుగు కొవ్వు లేకుండా ఉంటే మంచిది.
అధిక బరువు తగ్గాలనుకునే వారు పెరుగు తినకూడదు. ఇందులో కొవ్వు శాతం ఎక్కువ. స్కిమ్డ్ మిల్క్‌తో తయారైన పెరుగు తినండి. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. తమ బరువును అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించే వారు స్కిమ్డ్ మిల్క్‌తో చేసిన పెరుగును కూడా తీసుకోవాలి. ఇలా పెరుగు తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది.
పెరుగు తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. కాబట్టి మధ్యాహ్నం పూట తినడం మంచిది. పెరుగు తినడం వల్ల జీర్ణవ్యవస్థలోని మంచి బ్యాక్టీరియాకు మేలు జరుగుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పెరుగులో క్యాల్షియం, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. కండరాల నిర్మాణంలో సహాయపడుతుంది. చర్మాన్ని ఆరోగ్యవంతంగా మార్చుతుంది. శిరోజాలను రక్షిస్తుంది. అందువల్ల పెరుగులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
Wednesday: బుధవారం రోజు ఈ పనులు చేస్తే చాలు.. అదృష్టం పట్టిపీడించడం ఖాయం!