మామూలుగా మనం ఏదైనా పండుగలు శుభకార్యాలు జరిగినప్పుడు ఎక్కువగా బెల్లం అరిసెలు చేస్తూ ఉంటాం. ముఖ్యంగా శ్రీమంతం, పుష్పావతి, ఒడి బియ్యం పోసేటప్పుడు ఈ బెల్లం అరిసెలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. వీటిని చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడి తింటూ ఉంటారు. ఇవి తినడానికి ఎంతో రుచిగా కూడా ఉంటాయి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ బెల్లం అరిసెలు ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
బెల్లం అరిసెలకు కావలసిన పదార్ధాలు:
తడి బియ్యంపిండి – 1 / 2
బెల్లం – 350 గ్రాములు
నువ్వులు – 2 చెంచాలు
నూనె – వేయించడానికి సరిపడా
బెల్లం అరిసెలు తయారీ విధానం :
ముందుగా బియ్యం కడిగి ఒక రాత్రి అంత బాగా నానబెట్టుకుని ఉదయం చిల్లుల గిన్నెలో వడగట్టుకుని నీళ్ళు బయట మిల్లులో కానీ ఇంట్లో మిక్సీ లో గాని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బియ్యంపిండిని తడి ఆరకుండా గిన్నెలో నొక్కి ప్రక్కన ఉంచుకుని పొయ్యిమీద ఒక గిన్నెలో బెల్లం తరుగులో నీరు పోసి ఉండపాకం వచ్చేవరకు కలిపి నువ్వులు వేసి కొద్ది కొద్దిగా వరి పిండి వేస్తు ఉండలు లేకుండా మొత్తం పిండి పాకంలో కలిసేలా కలుపుకొని పిండి ఉండలు చేసే విధంగా కలుపుకొని ప్రక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు నూనె వేడిచేసుకుని ఈ పిండిని ఉండలుగా చేసుకుని ప్లాస్టిక్ కవర్ మీద అరిసెలా చేతితో నున్నగా వత్తుకొని నూనెలోకి వదలాలి అలా చేసి రెండు వైపులా దోరగా వేగాక రెండు చిల్లుల గరిటెల మధ్య అరిసెను గట్టిగా నొక్కితే నూనె మొత్తం బయటికివస్తుంది. అంతే ఎంతో స్వీట్ గా ఉంది బెల్లం అరిసెలు రెడీ.