Site icon HashtagU Telugu

Beetroot Kobbari Koora: బీట్ రూట్ కొబ్బరి కూర.. ఇలా చేస్తే గిన్నె మొత్తం ఖాళీ అవడం ఖాయం?

Mixcollage 23 Jan 2024 05 21 Pm 8964

Mixcollage 23 Jan 2024 05 21 Pm 8964

మామూలుగా మనం బీట్రూట్ తో రకరకాల రెసిపీలు తినే ఉంటాం. బీట్రూట్ ఫ్రై, బీట్రూట్ రైస్, బీట్రూట్ పులావ్, బీట్రూట్ హల్వా అలాంటి రెసిపీలను తినే ఉంటాం. అయితే ఎప్పుడైనా బీట్రూట్ కొబ్బరి కూడా తిన్నారా. ఒకవేళ తినకపోతే ఎంతో రుచికరమైన బీట్రూట్ కొబ్బరి కూరను సింపుల్గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

బీట్ రూట్ కొబ్బరి కూరకు కావలసిన పదార్ధాలు :

కొబ్బరి కోరు -1/2 కప్పు
ఎండు మిరప – సరిపడా
పచ్చిమిర్చి – సరిపడా
మినపప్పు – తగినన్ని
ఆవాలు – కొద్దిగా జీలకర్ర – కొద్దిగా
కరివేపాకు – సరిపడా
ఇంగువ – కొద్దిగా
పసుపు -1/4 స్పూన్
ఉప్పు -1/2 స్పూన్
చాట్ మసాలా -1/4 స్పూన్
నూనె – కొద్దిగా
నిమ్మరసం – 2 స్పూన్

బీట్ రూట్ కొబ్బరి కూర తయారీ విధానం :

ఇందుకోసం ముందుగా బీట్ రూట్ తోక్కతిసి చిన్నపాటి క్యూబ్ గా తరుగుకోవాలి. కొబ్బరి కోరు సిద్ధంగా ఉంచుకోవాలి. తర్వాత ఒక దళసరి గిన్నెలో కొద్దిగా నీరు తీసుకొని అందులో బీట్ రూట్ ముక్కలు వేసి మూతపెట్టి చిన్న మంటపై 8 నుండి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. తరువాత పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా నూనె వేసి వేడైన వెంటనే మినపప్పు , ఆవాలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ చివరగా కరివేపాకు వేసి పోపు దోరగా వేగే సమయంలో కొబ్బరి కోరువేసి కొద్దిగా వేయించాలి. మరీ ఎక్కువగా వేయిస్తే కొబ్బరి కమ్మదనం పోయి పీచుగామారుతుంది. కొబ్బటి తాజా సువాసనగా ఉండగా ఉడికి ఉమ్మగిల్లిన రూట్ ముక్కల్ని వేసి ఉప్పు, పసుపు జోడించాలి. చిన్న మంటపై మూతపెట్టి 2,3 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి కూరలో చాట్ మసాలా చల్లి నిమ్మరసం పై నుండి పోస్తూ కలపాలి. చాలా చాలా రుచిగా తియ్యగా, కమ్మగా మధ్యలో పులుపు తగులుతూ ఈ కూరని అలాగే తినేయ్యచు వేడి అన్నంలో రోటితో చాలా బావుంటుంది.