Beetroot: బీట్రూట్ తో అందాన్ని మరింత రెట్టింపు చేసుకోండిలా?

బీట్రూట్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. బీట్రూట్ వల్ల కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందరికి కూడా ఎన్నో రకాల ప

  • Written By:
  • Publish Date - August 6, 2023 / 08:00 PM IST

బీట్రూట్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. బీట్రూట్ వల్ల కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందరికి కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. పెదవులకు, స్కిన్ కి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అందాన్ని పెంచడంలో బీట్రూట్ ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. అంతేకాకుండా చాలా రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ లలో బీట్రూట్ ని కూడా ఉపయోగిస్తారు. అయితే అసలు అందానికి బీట్రూట్ కి ఉన్న సంబంధం ఏంటి? దానివల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రెండు చెంచాల బీట్ రూట్ రసంలో ఒక చెంచా పెరుగు మిక్స్ చేసి ముఖానికి పట్టించి ఇరవై నిముషాల తర్వాత ముఖం చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మొటిమలతో పాటు వాటి తాలుకు మచ్చలను కూడా పూర్తిగా నివారిస్తుంది.

బీట్ రూట్ జ్యూస్‌ను ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మ ఛాయ మెరుగుపడుతుంది. బీట్ రూట్ పేస్ట్‌లో కొద్దిగా పాలు మిక్స్ చేసి ముఖానికి పట్టించి అరగంట తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి. ఒక టీస్పూన్ బీట్ రూట్ జ్యూస్‌కు ఒక చెంచా నిమ్మరసం మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. రాత్రి పడుకొనే ముందు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. బీట్ రూట్ రసం, షుగర్ రెండింటి మిశ్రమాన్ని ముఖానికి పట్టించి స్ర్కబ్ చేయడం వల్ల ముఖంలో ఉండే బ్లాక్ హెడ్స్ నివారించబడుతాయి. ఉడకబెట్టిన బీట్‌రూట్‌ను గుజ్జుగా చేసి ముఖానికి, మెడభాగంలో అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే మీ చర్మంలో కాంతి వస్తుంది.

ఒక టేబుల్ స్పూన్ నానబెట్టిన బియ్యం, నాలుగైదు బీట్ రూట్ ముక్కల్ని కలిపి మెత్తగా చేసుకోవాలి. దానికి చెంచా తేనె, కొద్దిగా పాలు కలిపి దాన్ని ముఖానికి పూతలా రాసుకోవాలి. ఐదు నిమిషాల తరువాత పాలతో ముఖాన్ని మృధువుగా మర్ధన చేయాలి. పదినిమిషాల తరువాత గోరు వెచ్చని నీళ్లతో కడుగితే ముఖ చర్మం కాంతి వంతంగా మారుతుంది. బీట్ రూట్ లోని సిలికాన్ ఖనిజం చర్మాన్ని తాజాగా కనిపించటానికి దోహదపడుతుంది. బీట్ రూట్ రసానికి చెంచా బాదం నూనె, ఒక చుక్క తేనె కలిపి పెదాలకు పూతలా వేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే నల్లగా మారిన పెదాలు గులాబీ రంగులో మెరిసిపోతాయి. మృత కణాలు తొలగిపోవాలంటే బీట్ రూట్ గుజ్జుగా చేసి దానికి చిటికెడు పంచదార కలిపి ఆ మిశ్రమాన్ని పెదాలపై రుద్దాలి. ఇలా చేయటం వల్ల పెదాలు మృధువుగా ఉంటాయి.