Site icon HashtagU Telugu

Beetroot Biryani: బీట్‌రూట్ బిర్యానీ ఇలా చేస్తే చాలు.. లొట్టలు వేసుకొని తినేయాల్సిందే?

Mixcollage 13 Dec 2023 06 26 Pm 3463

Mixcollage 13 Dec 2023 06 26 Pm 3463

మామూలుగా మనం ఎన్నో రకాల బిర్యానీ రెసిపీలు తినే ఉంటాం. చికెన్ బిర్యాని, మటన్ బిర్యాని, ఫ్రాన్స్ బిర్యానీ, ఆలు బిర్యాని, చికెన్ దమ్ బిర్యాని అంటూ రకరకాల బిర్యానీలు తింటూ ఉంటాం. అయితే ఎప్పుడైనా బీట్రూట్ బిర్యానీ తిన్నారా. మామూలుగా బీట్రూట్ తో చేసే ఎటువంటి వంటకం అయినా కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడి తింటూ ఉంటారు. మరి ఎప్పుడైనా బీట్రూట్ బిర్యానీ తిన్నారా. ఒకవేళ తినకపోతే ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బీట్‌రూట్ బిర్యానీకి కావలసిన పదార్థాలు:

బీట్‌రూట్ – రెండు
బియ్యం – మూడు కప్పులు
ఉల్లిపాయలు – రెండు
పుదీనా – కొద్దిగా
కొత్తిమీర – కొద్దిగా
పచ్చి మిరపకాయలు – ఆరు
అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక స్పూను
ధనియాల పొడి – రెండు స్పూన్లు
గరం మసాలా – ఒక స్పూను
కారం – రెండు స్పూన్లు
పసుపు – చిటికెడు
మిరియాలు – కొద్దిగా
మసాలా ఆకు – నాలుగు
ఉప్పు, నూనె – తగినంత

బీట్‌రూట్ బిర్యానీ తయారీ విధానం:

దీనికోసం ముందుగా నీళ్ళల్లో బియ్యాన్ని అరగంట సేపు నానబెట్టుకోవాలి. తరువాత బీట్‌రూట్‌ని తురుముకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో తగినంత నూనె పోసుకొని వేడి అయ్యాక అందులో మసాల ఆకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. అందులో బీట్‌రూట్, అల్లం వెల్లుల్లి వేసి మరో ఐదు నిముషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి, గరం మసాల పొడి, కారం, పసుపు, మిరియాలు, తగినంత ఉప్పు వేసి రెండు నిముషాల పాటు వేయించుకోవాలి. అవన్నీ బాగా వేగాక అందులో నానబెట్టిన బియ్యాన్ని వేసి రెండు నిముషాల పాటు వేయించి అందులో సరిపడా నీళ్ళు పోసి మీడియం మంటపై అన్నం పూర్తిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. అంతే బీట్‌రూట్ బిర్యానీ రెడీ.

Exit mobile version