Site icon HashtagU Telugu

Beetroot Biryani: బీట్ రూట్ బిర్యానీ ఇలా చేస్తే చాలు.. లొట్టలు వేసుకొని తినేయాల్సిందే?

Beetroot Biryani

Beetroot Biryani

మామూలుగా మనం రకరకాల బిర్యానీలను తింటూ ఉంటాం. చికెన్ బిర్యానీ,మటన్ బిర్యానీ, ఫ్రాన్స్ బిర్యానీ, వెజిటేబుల్ బిర్యాని అంటూ రకరకాల బిర్యానీలు తింటూ ఉంటాము. అయితే ఎప్పుడైనా వెరైటీగా ఉండే బీట్రూట్ బిర్యానీ తిన్నారా. వినడానికి కాస్త నోరూరించే విధంగా ఈ రెసిపీని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బీట్‌రూట్ బిర్యానీకి కావలసిన పదార్థాలు:

బీట్‌రూట్ – రెండు
బియ్యం – మూడు కప్పులు
ఉల్లిపాయలు – రెండు
పుదీనా – కొద్దిగా
కొత్తిమీర – కొద్దిగా
పచ్చి మిరపకాయలు – ఆరు
అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక స్పూను
ధనియాల పొడి – రెండు స్పూన్లు
గరం మసాలా – ఒక స్పూను
కారం – రెండు స్పూన్లు
పసుపు – చిటికెడు
మిరియాలు – కొద్దిగా
మసాలా ఆకు – నాలుగు
ఉప్పు – తగినంత
నూనె – తగినంత

బీట్‌రూట్ బిర్యానీ తయారీ విధానం :

ముందుగా నీళ్ళల్లో బియ్యాన్ని అరగంట సేపు నానబెట్టుకోవాలి. తరువాత బీట్‌రూట్‌ని తురుముకోవాలి. ఒక గిన్నెలో నూనె పోసుకొని వేడి అయ్యాక అందులో మసాల ఆకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. అందులో బీట్‌రూట్, అల్లం వెల్లుల్లి వేసి మరో ఐదు నిముషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి, గరం మసాల పొడి, కారం, పసుపు, మిరియాలు, తగినంత ఉప్పు వేసి రెండు నిముషాల పాటు వేయించుకోవాలి. వేగాక అందులో నానబెట్టిన బియ్యాన్ని వేసి రెండు నిముషాల పాటు వేయించి అందులో సరిపడా నీళ్ళు పోసి మీడియం మంట మీద అన్నం పూర్తిగా ఉడికే వరకు ఉడికించుకుంటే సరి ఎంతో టేస్టీగా ఉండే బీట్‌రూట్ బిర్యానీ రెడీ..