Site icon HashtagU Telugu

Beerakaya Nuvvula Pachadi: ఎంతో రుచిగా ఉండే బీరకాయ నువ్వుల పచ్చడి.. టేస్ట్ అదుర్స్?

Beerakaya Nuvvula Pachadi

Beerakaya Nuvvula Pachadi

మామూలుగా చాలామంది డైలీ ఒకే విధమైన వంటలు తిని బోరు కొడుతోంది అని చెబుతూ ఉంటారు. మహిళలు కూడా భర్త,పిల్లల కోసం ఏదైనా కొత్తగా చేసి పెట్టాలి అనుకుంటూ ఉంటారు. కానీ ఏం వంటలు చేయాలి అన్నది తెలియక తెగ ఆలోచిస్తూ ఉంటారు. అయితే మరి కొత్తగా డిఫరెంట్ గా ట్రై చేయాలి అనుకుంటున్న వారికోసం ఈ రెసిపీ. అదే బీరకాయ నువ్వుల పచ్చడి. మరి ఈ రెసిపీ ఎలా చేయాలి? అందుకోసం ఎటువంటి పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బీరకాయ నువ్వుల పచ్చడికి కావలసినవి పదార్థాలు :

బీరకాయ ముక్కలు – కప్పు
టొమాటో ముక్కలు – అర కప్పు
చింతపండు– చిన్న గోళీ అంత
మినప్పప్పు – టీ స్పూన్‌
పచ్చి శనగపప్పు – టీ స్పూన్‌
నువ్వులు – 2 టేబుల్‌ స్పూన్లు
ఆవాలు– పావు టీ స్పూన్‌
జీలకర్ర – పావు టీ స్పూన్‌
ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చి – 6
నూనె – టీ స్పూన్‌
ఉప్పు – టీ స్పూన్‌
ఆవాలు– అర టీ స్పూన్‌
జీలకర్ర– అర టీ స్పూన్‌
వెల్లుల్లి రేకలు – 6
కరివేపాకు రెమ్మలు – 2
తెల్ల నువ్వులు – అర టీ స్పూన్‌.

తయారీ విధానం :

ఒక మందపాటి పెనంలో పచ్చి శనగపప్పు, మినప్పప్పు, నువ్వులు, మిర్చి, జీలకర్ర వేయించి ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. తరువాత అదే పెనంలో నూనె వేడి చేసిన బీరకాయ ముక్కలను ఒక రకంగా వేయించి పక్కన పెట్టాలి. అదే పెనంలో టొమాటో ముక్కలను వేసి సన్న మంట పై మగ్గనివ్వాలి. ఈలోపు వేయించిన గింజలు, మిర్చి చల్లారి ఉంటాయి. వాటిని మిక్సీ జార్‌లో మెత్తగా చేసి అందులో బీరకాయ ముక్కలు వేసి గ్రైండ్‌ చేయాలి. చివరగా టొమాటో ముక్కలు, చింతపండు, ఉప్పు వేసి గ్రైండ్‌ చేయాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని పోపు పెట్టాలి. తరువాత పెనంలో నూనె వేడి చేసి పోపుకోసం తీసుకున్న దినుసులన్నీ వేసి వేగిన తరవాత అందులో మిక్సీలో గ్రైండ్‌ చేసిన చట్నీని వేసి కలిపితే బీరకాయ చట్నీ రెడీ.