Beer Drinkers: బీరు బాబులకు శుభవార్త.. తాగనోళ్లకే ఆ డేంజర్ ఉంటదట!!

మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అని చెబుతూ ఉంటారు. ఎక్కువగా మద్యం సేవించే వారి ఆరోగ్యం పాడవుతుందని కూడా చెప్తుంటారు.

  • Written By:
  • Publish Date - September 29, 2022 / 08:30 AM IST

మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అని చెబుతూ ఉంటారు. ఎక్కువగా మద్యం సేవించే వారి ఆరోగ్యం పాడవుతుందని కూడా చెప్తుంటారు. కానీ ఒక లిమిట్ లో ప్రతి రోజు బీరు తాగడం వల్ల ఒక ఆరోగ్య ప్రయోజనం ఉంటుందని ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెలుగులోకి వచ్చింది. దీన్ని చూసి మందుబాబులకు పండుగ చేసుకున్నట్టుగా ఉంటుంది.
అయితే వాళ్లంతా సంబర పడటానికి ముందు దీనికి సంబంధించి కొన్ని విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
ఈ రిసెర్చ్ లో భాగంగా 60 ఏళ్లకు పైబడిన దాదాపు 25వేల మందిపై స్టడీ చేశారు. రోజుకు 946 మిల్లీ లీటర్లకు మించకుండా బీర్ తాగే వాళ్లకు జ్ఞాపకశక్తి తగ్గే ముప్పు బాగా తగ్గినట్టు గుర్తించారు. వీరితో పోలిస్తే అస్సలు మద్యం తాగని వారికి మతిమరుపు ముప్పు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. ఇక మద్యం అతిగా తాగే వారికి మాత్రం శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోయి లేనిపోని రోగాలు చుట్టుముట్టినట్లు తేలింది. దీన్నిబట్టి చాలా లైట్ గా అప్పుడప్పుడు బీర్ తీసుకోవడం వల్ల డేంజర్ ఉండదని శాస్త్రవేత్తలు సూచించారు. మద్యం తాగకుండా దానికి పూర్తిగా దూరంగా ఉంటే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని నివేదిక తెలిపింది. ప్రధానంగా 60 ఏళ్ల వయస్సు దాటిన వాళ్లకు మతిమరుపు ముప్పు చాలా ఎక్కువ. ఈ ముప్పు గత ముప్పై ఏళ్లలో 3 రెట్లు పెరిగింది. ప్రపంచంలో మతిమరుపు బారిన పడుతున్న ప్రతి 10 మందిలో నలుగురిని రక్షించవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే వారిలో మతిమరుపు రావడానికి గల కారణాన్ని తెలుసుకుంటేనే ఇది సాధ్యం అవుతుందని చెప్పారు. మద్యం అలవాటు, మతి మరుపు ముప్పుపై గతంలో జరిగిన 15 అధ్యయన నివేదికలలోని సమాచారాన్ని విశ్లేషించి ఈ నివేదికను రెడీ చేశామని వెల్లడించారు. తక్కువ మోతాదులో బీర్ తాగితే బాడీకి మంచి కొవ్వు అందుతుందని వివరించారు. అలా అని మద్యం అలవాటు చేసుకోవద్దని హెచ్చరించారు.

డిమెన్షియాకు, అల్జీమర్స్‌కు తేడా..

మతిమరుపు, ఆలోచనా శక్తి లోపించే సమస్య డిమెన్షియాకు, అల్జీమర్స్‌కు కొంచెం తేడా ఉంటుంది. డిమెన్షియా అంటే రోజువారీ పనుల్లో మెదడు సాధారణ విధుల్లో అసౌకర్యం తలెత్తడం. ఇక అల్జీమర్స్‌ అనేది డిమెన్షియాలో ఒక రకం.

డిమెన్షియా ఓ సాధారణం పదం. దానిలో అల్జీమర్స్‌లో ప్రత్యేకమైనది. దానినే కామ్‌నెస్ డిమెన్షియా అని అంటారు. 60 నుంచి 70 శాతం మందికి అల్జీమర్స్‌ డిమన్షియానే అవుతుంది. వయస్సు బట్టి రోగి తన ఙ్ఞాపకశక్తిని, పని చేసే సామర్ధ్యాన్ని, సమాజంలో ఆ వ్యక్తి సాధారణ ప్రవర్తన కోల్పోయినట్టు కనిపిస్తాడు. 65 ఏళ్ల వయస్సులో సుమారు 6 శాతం మందికి అల్జీమర్స్‌ వచ్చే అవకాశం ఉంది.85 ఏళ్ల తర్వాత 30 శాతం అల్జైమర్స్ వచ్చే అవకాశం ఉంటుంది.