Site icon HashtagU Telugu

Vastu tips: బెడ్ రూమ్ లో వాస్తు ఈ విధంగా ఉంటే చాలు.. అన్నీ విజయాలే?

Vastu Tips

Vastu Tips

ప్రస్తుత రోజుల్లో రోజురోజుకీ వాస్తు శాస్త్రాన్ని నమ్మే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇదివరకు వాస్తు శాస్త్రాన్ని పెద్దగా నమ్మనివారు కూడా ప్రస్తుత రోజుల్లో వాస్తు విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాస్తు శాస్త్రంలో ఇంటి నిర్మాణంలో అలాగే ఇంట్లోని వస్తువుల విషయంలో మొక్కల విషయంలో ఇలా అనేక రకాల విషయంలో వాస్తు శాస్త్ర ప్రకారం కొన్ని రకాల నియమాలు చెప్పబడ్డాయి. అదేవిధంగా పడకగదిలో కూడా వాస్తు ప్రకారంగా కొన్ని వస్తువులు ఉంటే శుభాలు కూడా జరుగుతాయట. మరి పడక గదిలో ఎటువంటి వాస్తు మార్పులు చేసుకుంటే మంచి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మొదట ఇంట్లో పడకగదిని నిర్మించేటప్పుడు వాస్తు విషయం తప్పకుండా గుర్తుంచుకోవాలి. వాస్తు ప్రకారంగా పడకగదిని నిర్మించాలి. అలాగే పడకగదిలో మంచం కోసం కూడా సరైన దిశను ఎంచుకోవాలి. పడకగదిలో మీ తలను ఆగ్నేయం లేదంటే పడమర వైపు పెట్టుకుని నిద్రపోవాలి. పడుకునేటప్పుడు ఉత్తరం వైపు మాత్రం చూడకుండా ఉండే విధంగా మంచాన్ని సరైన దిశలో ఏర్పాటు చేసుకోవాలి. వాస్తు ప్రకారం గా పడక గదిలో రంగుల విషయానికి వస్తే..ఆఫ్ వైట్ రంగు లేదంటే లేత గోధుమ రంగును ఎంచుకోవాలి. ప్రకాశవంతంగా వెలిగే రంగులకు బదులుగా తటస్థ రంగులను ఎంచుకోవాలి.

పడకగదిలో ఎప్పుడూ మెటల్ మంచాలు, మెటల్ బెడ్ రూమ్ లు ఉంచడం మంచిది కాదు. ఇది నిద్రకు అంతరాయాన్ని కలిగించడంతోపాటు అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. ఎల్లప్పుడూ దృఢమైన చెక్కతో చేసిన మంచంపై నిద్రపోవడం మంచిది. పడక గదిలో ఎప్పుడూ ప్రకృతితో చిత్రాలు ఉండాలి. అలాగే పడక గదిలో ఒంటరితనం విచారాన్ని కలిగించే ఫోటోలను పెట్టుకోకూడదు. మరి ముఖ్యంగా పడకగదిలో పచ్చని పర్వతాలు సంధ్యా సమయం ఇలా ప్రకృతి అందాలను వర్ణించే ఫోటోలను పెట్టుకోవడం మరీ మంచిది.

Exit mobile version