Site icon HashtagU Telugu

Beauty Tips: ముఖంపై ముడతలు రాకుండా యవ్వనంగా ఉండాలంటే ఇలా చేయాల్సిందే?

Mixcollage 19 Mar 2024 06 50 Pm 9324

Mixcollage 19 Mar 2024 06 50 Pm 9324

మామూలుగా వయసుతో పాటు ముఖంపై ముడతలు రావడం అన్నది సహజం. ఇంకొందరికి వయసుతో సంబంధం లేకుండా ముఖంపై మొటిమలు సమస్యలు ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఈరోజుల్లో చిన్న వయసులో ఉన్నవారు కూడా ముఖంపై ముడతల సమస్యను ఎదుర్కొంటున్నారు. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం వంటి కారణాలు ముఖంపై ముడతలు వచ్చేలా, చిన్న వయసులోనే వృద్ధాప్యం వచ్చేలా చేస్తున్నాయి. ఇక ముఖంపై ముడతల కారణంగా అందవిహీనంగా కనిపిస్తున్నామని దిగులు చెందుతూ ఉంటారు.

ఈ ముడతలను కవర్ చేసుకోవడానికి పోగొట్టుకోడానికి మార్కెట్ లో దొరికి ఎన్నో రకాల బ్యూటీ ప్రోడక్ట్ లను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు మంచి ఫలితాలు కనిపించవు. మరి అలాంటప్పుడు హోమ్ రెమెడీస్ ట్రై చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. మన ఇంట్లోనే దొరికే వస్తువులతో చిన్న చిన్న చిట్కాలను ఉపయోగించి ముఖంపై ముడతలు పోగొట్టుకోవచ్చని చెబుతున్నారు. కాగా ముఖంపై ముడతలు పోవడానికి కలబంద ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం కలబంద గుజ్జును పూసుకోవడం వల్ల చర్మం మీద ముడతలు, గీతలు తగ్గుతాయి. కలబందతో కొలాజిన్ ఉత్పత్తి జరిగి చర్మం మృదువుగా మారుతుంది.

కలబందలో ఉండే మాయిశ్చరైజింగ్ గుణాలు చర్మం తేమగా, నిగారింపుతో ఉండేలా చేస్తాయి. అదేవిధంగా ముఖంపై ముడతలు పోవడానికి తేనె ఎంతో బాగా ఉపయోగపడుతుంది. తేనెలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మ కణాలను కాపాడతాయి. తేనే చర్మంలో ఉన్న తేమను కాపాడుతుంది. ముఖంపై ముడతలు పోవాలంటే తేనెను అప్లై చేసి కాసేపు ఆరనిచ్చి ఆపై గోరువెచ్చటి నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ముఖంపై ముడతలు తగ్గుతాయి. ముఖంపై ముడతలు పోవడానికి కొబ్బరి నూనె ఎంతో బాగా ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనెలో ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి నూనె చర్మం హైడ్రేటెడ్ గా ఉంచడానికి, పోషణ అందించడానికి తోడ్పడుతుంది. కొబ్బరి నూనె ముఖానికి మసాజ్ చేసుకొని ఒక గంట పాటు ఉంచి ఆపై నీళ్లతో కడుక్కుంటే చర్మం మృదువుగా మారుతుంది. ముడతలు తగ్గుతాయి.