Beauty tips: ముఖంపై ముడతలు రాకుండా యవ్వనంగా ఉండాలంటే ఇలా చేయాల్సిందే?

మామూలుగా చాలామందికి ముఖంపై ముడతల సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ ముడతల కారణంగా చాలామంది నలుగురికి వెళ్లాలి అన్న కూడా ఇబ్బంది

  • Written By:
  • Updated On - March 5, 2024 / 07:34 PM IST

మామూలుగా చాలామందికి ముఖంపై ముడతల సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ ముడతల కారణంగా చాలామంది నలుగురికి వెళ్లాలి అన్న కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖంపై ఈ ముడతల సమస్యను తగ్గించుకోవడానికి చాలా మంది ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే మార్కెట్లో దొరికే రకరకాల కెమికల్ ప్రొడక్ట్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే మనకు తెలియకుండానే ఇట్లాంటి ఉత్పత్తుల వల్ల దుష్ప్రభావాలు ఎదురవుతున్నాయి. అందుకే చాలామంది ముఖంపై ముడతలను తగ్గించుకోవాలంటే కాస్మటిక్ ప్రొడక్ట్స్ కాదు నాచురల్ రెమిడీస్ ని ట్రై చేయాలని చెబుతున్నారు.

అందుకోసం మన ఇంట్లోనే దొరికే వస్తువులతో చిన్న చిన్న చిట్కాలను ఉపయోగించి ముఖంపై ముడతలు పోగొట్టుకోవచ్చని చెబుతున్నారు. మరి అందుకోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే.. ముఖంపై ముడతలు పోవడానికి కలబంద ఎంతో బాగా ఉపయోగపడుతుంది. కలబంద గుజ్జును పూసుకోవడం వల్ల చర్మం మీద ముడతలు, గీతలు తగ్గుతాయి. కలబందతో కొలాజిన్ ఉత్పత్తి జరిగి చర్మం మృదువుగా మారుతుంది. కలబందలో ఉండే మాయిశ్చరైజింగ్ గుణాలు చర్మం తేమగా, నిగారింపుతో ఉండేలా చేస్తాయి. అలాగే ముఖంపై ముడతలు పోవడానికి తేనె ఎంతో బాగా ఉపయోగపడుతుంది. తేనెలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మ కణాలను కాపాడతాయి. తేనే చర్మంలో ఉన్న తేమను కాపాడుతుంది.

ముఖంపై ముడతలు పోవాలంటే తేనెను అప్లై చేసి కాసేపు ఆరనిచ్చి ఆపై గోరువెచ్చటి నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ముఖంపై ముడతలు తగ్గుతాయి. ముఖంపై ముడతలు పోవడానికి కొబ్బరి నూనె ఎంతో బాగా ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనెలో ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి నూనె చర్మం హైడ్రేటెడ్ గా ఉంచడానికి, పోషణ అందించడానికి తోడ్పడుతుంది. కొబ్బరి నూనె ముఖానికి మసాజ్ చేసుకొని ఒక గంట పాటు ఉంచి ఆపై నీళ్లతో కడుక్కుంటే చర్మం మృదువుగా మారుతుంది. ముడతలు తగ్గుతాయి.