మాములుగా ముఖం అందంగా ఉన్నా కొందరికి ముక్కుపై నల్లటి మచ్చలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటినే బ్లాక్ హెడ్స్ అని అంటారు. కొంతమందికి ఈ బ్లాక్ హెడ్స్ బయటికి కనిపిస్తూ అందవిహీనంగా కనిపిస్తుంటాయి. అయితే ఈ బ్లాక్ హెడ్స్ ని తగ్గించుకునేందుకు ఎన్నెన్నో బ్యూటీ ప్రొడక్ట్స్ అలాగే న్యాచురల్ టిప్స్ ని ఫాలో అవుతూ ఉంటారు. అయినప్పటికీ ఈ నల్లటి మచ్చలు మాత్రం పోవు. అలాంటప్పుడు ఏం చేయాలో, ఎలాంటి చిట్కాలను ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మామూలుగా ఒక వయసు వచ్చిన తర్వాత ఈ నల్లటి మచ్చలు రావడం అన్నది కామన్.
ముక్కుపై ఉండే నల్లటి మచ్చలు అందాన్ని తగ్గిస్తాయి. అయితే ఈ మచ్చలను ఎలా తొలగించాలి అన్న విషయానికి వస్తే.. అరటి తొక్క ఎందుకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ముక్కుపై ఉంటే నల్లటి మచ్చలను తొలగించడంలో అరటితొక్క ఎంతో బాగా పనిచేస్తుంది. డార్క్ స్పాట్స్ ను తగ్గించే సింపుల్ హోం రెమెడీ ఇది. అయితే ఇందుకోసం అరటిపండు తిన్నప్పుడల్లా దాని తొక్కను పారేయకుండా ముక్కుపై ఉండే నల్లటి మచ్చలపై రుద్దాలి. ఈ విధంగా తరచూ చేస్తూ ఉండటం వల్ల ముక్కు పై ఉండే నల్లటి మచ్చలు తొలగిపోతాయట.
పసుపు అందానికి ఎంతో మేలు చేస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. పసుపులో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అయితే ముక్కుపై ఉండేటటువంటి మచ్చలు పోవాలి అంటే పసుపులో కొద్దిగా కొబ్బరి నూనెను మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలట. పది నుంచి 15 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేయాలని ఇలా వారానికి రెండు నుంచి మూడు సార్లు చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయని చెబుతున్నారు.
అలాగే తేనె కూడా అందానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం తేనెను నల్లటి మచ్చలపై అప్లై చేసి కాసేపు మసాజ్ చేసి అరగంట పాటు అలాగే ఉంచి ఆ తర్వాత శుభ్రం చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయని చెబుతున్నారు.
నల్లటి మచ్చలను తగ్గించడంలో ముల్తానీ మట్టి కూడా ఎంతో బాగా పనిచేస్తుంది. అయితే ఇందుకోసం ముల్తానీ మట్టిని పేస్ట్ లాగా చేసి నల్లటి మచ్చలపై అప్లై చేయాలి. పూర్తిగా ఆరిన తర్వాత నీళ్లతో తడిపీ కాసేపు మసాజ్ చేసి ఆ తర్వాత కడిగేయాలి. ఈ విధంగా ప్రతిరోజు చేయడం వల్ల ముక్కుపై ఉండే నల్లటి మచ్చలు తొలగిపోతాయట.