Beauty Tips: ఈ ఒక్క ప్యాక్ తో ముఖంపై మృత కణాలు తొలగిపోవడంతో మరెన్నో లాభాలు?

మామూలుగా చాలామంది చర్మ సమస్యలతో తరచూ బాధపడుతూ ఉంటారు. సీజన్ తో సంబంధం లేకుండా చర్మ సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ముఖ్యంగా ము

Published By: HashtagU Telugu Desk
Mixcollage 20 Dec 2023 05 38 Pm 6726

Mixcollage 20 Dec 2023 05 38 Pm 6726

మామూలుగా చాలామంది చర్మ సమస్యలతో తరచూ బాధపడుతూ ఉంటారు. సీజన్ తో సంబంధం లేకుండా చర్మ సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ముఖ్యంగా ముఖంపై ఓపెన్ ఫోర్స్, మొటిమలు, మచ్చలు, మృత కణాలు, అవాంచిత రోమాలు వంటి వాటితో చాలా మంది నలుగురులోకి వెళ్లాలి అన్న కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే వీటిని తగ్గించుకోవడానికి చాలా మంది అనేక రకాల చిట్కాలను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఫలితం లభించక దిగులు చెందుతూ ఉంటారు. ఇకపై దిగులు చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇంట్లోనే తయారు చేసుకునే ఒక్క ప్యాక్ తో ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టవచ్చు.

ఇంతకీ ఆ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి? అందుకు ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ ప్యాక్ కోసం ముందుగా ఒక టమాట తీసుకొని దాని ముక్కలుగా చేసి దానిలో ఉన్న గుజ్జు గింజల్ని తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఏడు చుక్కల నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కస్తూరి పసుపు ఒక హాఫ్ స్పూను వేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి అందులో ఒక చెంచా మనం వినియోగించి ఏదైనా కాపీ పౌడర్ వేయాలి. ఇది మొత్తం బాగా కలిపి అందులో ఆరెంజ్ ఫీల్ ఆఫ్ మాస్క్ లేదా అలివేరా జెల్ ఫీల్ ఆఫ్ మాస్కుని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అయితే ఆ ప్యాక్ వేసుకోవడానికి ముందుగా మనం ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఆ తర్వాత మన ముఖంపై మనం తయారు చేసుకున్న ప్యాక్ ని ఒక లేయర్ లాగా వేసుకోవాలి. అలా వేసేటప్పుడు సమానంగా వేసుకోవాలి. ఆ విధంగా అప్లై చేసిన తదుపరి 15 నిమిషాలు పాటు ఈ ప్యాక్ ని బాగా ఆరనివ్వాలి. ప్యాక్ ఆరిన తర్వాత ఒక గ్లస్సిగా కనిపిస్తూ ఉంటుంది. ఆ తదుపరి ఈ ప్యాక్ పై నుంచి కిందికి ఫీల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చేయడం వలన ముఖంపై ఉన్న వైట్ అండ్ బ్లాక్ హెడ్స్ పోతాయి. అలాగే చర్మం టైట్ గా అవుతుంది. అవాంఛిత రోమాలు కూడా తొలగిపోతాయి. దీనిలో వాడిన నిమ్మరసం అలాగే టమాట జ్యూస్ ఫేస్ పై బ్లీచ్ లాగా సహాయపడుతుంది. కావున చర్మంపై ఉన్న మృతుకనాలు తొలగిపోతాయి. అదేవిధంగా చర్మం మెరిసిపోతూ ఉంటుంది. ముఖంపై మొటిమలు వాటి తాలూకా మచ్చలు కూడా తగ్గిపోతాయి. ఈ ప్యాక్ ని తరచుగా ట్రై చేస్తూ ఉండటం వల్ల ఆ ముఖం అందంగా గ్లో గా కనిపిస్తూ ఉంటుంది.

  Last Updated: 20 Dec 2023, 05:38 PM IST