Site icon HashtagU Telugu

Beauty Tips: మెడ నల్లగా ఉందని ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇది ఒక్కసారి రాస్తే చాలు?

Mixcollage 21 Dec 2023 02 00 Pm 9447

Mixcollage 21 Dec 2023 02 00 Pm 9447

మనలో స్త్రీ పురుషులకు చాలామందికి మెడ భాగం మొత్తం నల్లగా అవుతూ ఉంటుంది. పురుషులు ఈ విషయాన్ని అంతగా పట్టించుకోకపోయినా స్త్రీలు మాత్రం మెడ భాగం నల్లగా ఉంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆడవాళ్లు మెడలో వేసుకునే నగల వలన మెడ భాగం నల్లగా మారిపోతూ ఉంటుంది. మెడ నలుపు వదిలించుకోవడం కోసం రకరకాల ప్రొడక్ట్స్ ను వాడుతూ ఉంటారు. అయితే అవి వాడడం వలన ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. కానీ ఎటువంటి ఫలితం ఉండదు. కొందరు ఇంట్లోనే ఉపయోగించే పసుపు, శనగపిండి వంటి వాటిని ఉపయోగించినా కూడా సరైన ఫలితం ఉండదు.

దాంతో చాలామంది నలుపును పోగొట్టుకోవడానికి ఏం చేయాలి అని దిగులు చెందుతూ ఉంటారు. అయితే ఇక మీదట ఆ దిగులు అక్కర్లేదు. ఎందుకంటే మెడపై నలుపుదనం పోగొట్టే చక్కని చిట్కాను మీకోసం తీసుకు వచ్చాము. మరి ఆ వివరాల్లోకి వెళితే.. దానికోసం ఒక గిన్నెను తీసుకొని రెండు స్పూన్ల కోల్గేట్ పేస్టులను తీసుకోవాలి. ఈ పేస్టు బ్లీచింగ్ గుణాలు కలిగి ఉండడం వలన మెడపై ఉండే జిడ్డు మురికి నలుపు రిమూవ్ చేసుకోవడంలో గొప్పగా సహాయపడుతుంది. ఆ తదుపరి ఒక స్పూన్ బియ్యప్పిండిని తీసుకోవాలి. బియ్యప్పిండి చర్మం తెలుపుదనానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. తదుపరి దీనిలో ఒక నిమ్మకాయ రసం తీసుకోవాలి. అలాగే పీల్ ఆఫ్ మాస్క్ తీసుకోవాలి. దీన్ని తీసుకొని ఒక స్పూను దానిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని మెడకి రాయడానికి ముందు మెడ నలుపు ఉన్న ప్రదేశంలో మొత్తం. టవల్ని వేడి నీటిలో ముంచుకుని ఆ టవల్తో మొత్తం బాగా రుద్దుకోవాలి. తర్వాత ఒక నిమ్మచెక్కను తీసుకొని మెడ భాగం మొత్తం దాంతో బాగా రుద్దాలి. ఆ తరువాత మళ్లీ నీళ్లతో కడగకుండా టవల్ని వేడి నీటి లో ముంచి మళ్లీ దానితో శుభ్రంగా తుడుచుకోవాలి. మనం ముందు తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఆ ప్రదేశంలో రాసుకోవాలి. అలా రాసుకున్న తర్వాత కొద్దిసేపు దానిని ఆరనివ్వాలి. అలా ఆరిన తర్వాత కొంచెం బియ్యం పిండి చల్లి బాగా రుద్దుకోవాలి. ఆ తర్వాత మళ్లీ నిమ్మచెక్కను పంచదారలో ముంచి ఒక ఐదు నిమిషాల పాటు మృదువుగా బాగా మసాజ్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వలన మెడ భాగంలో ఉండే మురికి జిడ్డు మొత్తం తొలగిపోయి నలుపు వదులుతుంది. వారంలో ఒకసారి ఈ విధంగా చేయడం వలన మెడ మీద ఉన్న నలుపు మొత్తం వదిలిపోతుంది.

Exit mobile version