Beauty Tips: 60లో కూడా యంగ్ గా కనిపించాలి అంటే.. ఇలా చేయాల్సిందే?

  • Written By:
  • Updated On - February 28, 2024 / 05:01 PM IST

ప్రస్తుతం రోజుల్లో చాలామంది చిన్న వయసు వారు కూడా అనేక రకాల కారణాల వల్ల ఎక్కువ వయసు ఉన్న వారిలా కనిపిస్తూ ఉంటారు. ముఖంపై ముడతలు రావడం, వృద్ధాప్య ఛాయలు కనిపించడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే వయసు పెరుగుతున్నా కూడా అందం మరింత పెరగడం కోసం యంగ్ గా కనిపించడం కోసం చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు కూడా యంగ్ గా కనిపించాలనుకుంటున్నారా. అయితే ఉసిరికాయలు తినాల్సిందే. మరియు ఉసిరికాయలతో ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మామూలుగా పచ్చి ఉసిరికాయలు మనకు కేవలం కొన్ని సీజన్లుగా మాత్రమే లభిస్తూ ఉంటాయి. కానీ ఎండ పెట్టిన ఉసిరికాయలు మనకు మార్కెట్లో ఏడాది పొడవునా లభిస్తూ ఉంటాయి. అలా ఎండపెట్టిన ఉసిరికాయ ముక్కలు తెచ్చుకుని ముక్కల్ని కాస్త నోట్లో వేసుకుని వక్కపొడి లాగా భోజనం అనంతరం మూడు పూటలాముక్కలు చప్పరిస్తూ ఉండాలి. ఆ ఉసిరికాయ ముక్కలు ఎండిన విటమిన్ సి నశించదు. ఈ ఎండపెట్టిన ఉసిరికాయ ముక్కలు తెచ్చుకుని దాన్ని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ ఒక సీసాలో ఉంచుకుని దాన్ని రోజు రెండు స్పూన్ల తీసుకొని ఒక చిన్న ప్లేట్ లో వేసేసి అందులో మూడు నాలుగు స్పూన్లు తేనె వేసేసేయండి. ఉసిరిపొడి కాంబినేషన్ అట్ల నాకండి. పది నిమిషాలు సేపట్లో నాకుతుంటే చాలా టేస్టీగా కాంబినేషన్ బాగుంటుంది.

తేనె పవర్ ఫుల్ ఆంటీ బ్యాక్టీరియా ఆంటీ వైరల్ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి. ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది అన్నమాట. కాబట్టి అలాంటి ఉసిరికాయని పొడి రూపంలో కూడా ఇలా వాడండి. ఉసిరికాయ మంచిదని ఆవకాయలు మాత్రం మంచిది కాదు. ఈ పెద్ద ఉసురికాయలతో రోటి పచ్చళ్ళు ఇతర వాటిలన్నింటిలో వాడుకోవచ్చు. కాబట్టి ప్రతిరోజు రెండు ఉసిరికాయ ముక్కలు తీసుకోవడం వల్ల అందంగా యంగ్ గా కనిపిస్తారు.