Site icon HashtagU Telugu

Beauty Tips: ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ బెస్ట్ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయాల్సిందే?

Beauty Tips

Beauty Tips

ప్రస్తుత రోజుల్లో స్త్రీ పురుషులు చాలామంది ఏం మొఖంపై ముడతల సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే ముఖంపై ముడతలు ఏర్పడడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఈ ముడతల కారణంగా చిన్న వయసులోనే వయసు ఎక్కువ ఉన్న వారిలా వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ ముడతలను తగ్గించుకోవడం కోసం ఎన్నెన్నో చిట్కాలు పరిహారాలు ఫేస్ ప్యాక్ లు పాటిస్తూ ఉంటారు. అయినా కూడా మంచి ఫలితాలు కనిపించవు. అయితే ఈ ముడతలు మాయం అవ్వాలంటే కొన్ని రకాల ఇంటి చిట్కాలను పాటించాలని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

గుడ్డు,నిమ్మకాయ పేస్ ప్యాక్.. గుడ్డులోని తెల్లసొన ప్రోటీన్ చర్మం స్థితిస్థాపకత, దృఢత్వాన్ని పెంచడం ద్వారా ముడతలను తగ్గిస్తుందట. కాగా నిమ్మకాయ లోని విటమిన్ సి శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, చర్మం దృఢంగా , ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుందని చెబుతున్నారు. కాగా గుడ్డులోని తెల్లసొనను ఒక చెంచా నిమ్మరసంలో కలిపి ముఖానికి పట్టించి, 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆపై ముఖం కడుక్కోవాలి. ఇలా చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయట.

ఆల్మండ్ ఆయిల్,క్యారెట్ ఫేస్ ప్యాక్.. క్యారెట్‌ లోని పోషకాలు చర్మానికి అవసరమైన పోషకాలను అందిస్తాయట. అలాగే చర్మంపై మలినాలను తొలగించి, చర్మానికి దృఢత్వాన్ని అందిస్తాయట. అలాగే ముడతలను పోగొట్టి, చర్మ కాంతిని పెంచుతుందని, బాదం నూనెలో ఉండే విటమిన్ ఇ చర్మంలోని కొల్లాజెన్‌ ను కోల్పోకుండా చేస్తుందని చెబుతున్నారు. అయితే రెండు క్యారెట్‌ లను తొక్క తీసి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత అందులో ఒక చెంచా బాదం నూనె వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలట. ఒక గంట తర్వాత మీ ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడగాలట. ఉత్తమ ఫలితాల కోసం వారానికి మూడుసార్లు ఇలా చేయవచ్చని చెబుతున్నారు.

కీర దోసకాయ పేస్ ప్యాక్.. కీర దోసకాయలో ఉండే పోషకాలు ముఖం ముడుతలను తగ్గిస్తాయట. అలాగే ఇది చర్మంపై మచ్చలు, ముడతలను తొలగించడంలో సహాయపడుతుందట. ముఖ్యంగా కళ్ల కింద నల్లటి ప్రాంతాన్ని తొలగిస్తుందని చెబుతున్నారు. సగం కీర దోసకాయ పొట్టు తీసి రుబ్బుకోవాలి. తర్వాత అందులో ఒక గుడ్డులోని తెల్లసొన, ఒక చెంచా నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి పట్టించాలట. సుమారు 15 నుండి 20 నిమిషాల తర్వాత మీ ముఖాన్ని కడగాలట.

బొప్పాయి పేస్ ప్యాక్.. బాగా పండిన బొప్పాయిని గ్రైండ్ చేసి ముఖానికి అప్లై చేసి, 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలట. ఉత్తమ ఫలితాల కోసం వారానికి రెండుసార్లు ఈ ప్యాక్ ని ట్రై చేయవచ్చు అని చెబుతున్నారు..