Site icon HashtagU Telugu

Beauty Tips: అందాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా.. అయితే ముల్తానీ మట్టితో ఇలా చేయాల్సిందే!

Beauty Tips

Beauty Tips

ముల్తానీ మట్టి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ముల్తానీ మట్టి అందానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ ముల్తానీ మట్టిని అందానికి సంబంధించిన ఎన్నో రకాల బ్యూటీ ప్రొడక్టులలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ముల్తానీ మట్టి చర్మ సౌందర్యాన్ని మరింత పెంచుతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే చర్మ సౌందర్యం మరింత పెరగాలంటే ముల్తానీ మట్టిని ఏ విధంగా ఉపయోగించాలో ఎలా ఉపయోగిస్తే చర్మ సౌందర్యం పెరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ముల్తానీ మట్టి మన ముఖ సౌందర్యాన్ని పెంచడంతో పాటు చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ మట్టిని ఉపయోగించడం వల్ల మన అందం పెరుగుతుంది.

ముఖాన్ని తేమగా ఉంచి, జిడ్డును పోగొడుతుంది. ముల్తానీ మిట్టిని ఉపయోగించడం వల్ల చర్మంపై పేరుకుపోయిన మురికి అంతా పోతుంది. అలాగే దీన్ని చర్మాన్ని శుద్ధి చేయడానికి, చర్మంపై నూనెను గ్రహించి క్రిమి సంహారక చేయడానికి ఉపయోగిస్తారు. ఇది చర్మ రంధ్రాల నుండి అదనపు నూనెను, దుమ్ము, ధూళిని తొలగించడానికి కూడా సహాయపడుతుందని చెబుతున్నారు. మరి ముల్తానీ మట్టిని ఎలా ఉపయోగించాలి అన్న విషయానికి వస్తే.. అయితే ముందుగా ఒక టీస్పూన్ ముల్తానీ మట్టిని తీసుకుని అందులో రెండు చెంచాల రోజ్ వాటర్ ను పోసి ప్యాక్ ను తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేయాలి. ఈ ప్యాక్ ను వారానికి మూడుసార్లు వేసుకుంటే మీరు మరింత అందంగా కనిపిస్తారు. మొటిమల సమస్య కూడా ఉండదట. తరచుగా ఇలా చేయడం వల్ల మంచి ప్రయోజనాలు కనిపిస్తాయని చెబుతున్నారు.

మరొక రెమిడీ విషయానికి వస్తే.. టేబుల్ స్పూన్ టమోటా జ్యూస్ ను తీసుకుని అందులో టేబుల్ స్పూన్ ముల్తానీ మిట్టిని, ఆఫ్ టీస్పూన్ పసుపును వేయండి. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసి పేస్ట్ లా తయారు చేసి ఈ ప్యాక్ ను ముఖానికి బాగా అప్లై చేయాలి. ఇది పూర్తిగా ఆరిన తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని నీట్ గా శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి రెండు లేదా మూడు సార్లు ఉపయోగించవచ్చు. ఇలా చేస్తే మీరే మార్పును గమనించవచ్చని చెబుతున్నారు.