Site icon HashtagU Telugu

Beauty Tips: ఆలూతో ఈ ఫేస్ ప్యాక్ వేసుకుంటే చాలు.. ముఖం అందంగా మెరిసిపోవడం ఖాయం?

Mixcollage 10 Jan 2024 08 52 Pm 242

Mixcollage 10 Jan 2024 08 52 Pm 242

బంగాళదుంప వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆరోగ్యపరంగానే కాకుండా అందానికి కూడా బంగాళదుంప ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేయడంలో బంగాళదుంప ఎంతో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అందుకే చాలామంది అందాన్ని రెట్టింపు చేసుకోవడం కోసం బంగాళదుంపని ఉపయోగిస్తూ ఉంటారు. ముఖంపై మొటిమలు మచ్చలు వంటి సమస్యలు తొలగించడంలో కూడా బంగాళదుంప ఎంతో బాగా పనిచేస్తుంది. కాగా బంగాళదుంపలో ఉండే విటమిన్ బీ , సీ లు స్ట్రార్చ్ కూడా చర్మ రంగును కాంతివంతంగా మార్చుతాయి. కళ్ల‌ క్రింది చర్మంను కాపాడి, నల్లటి వలయాలను నివారిస్తాయి.

కంటి చుట్టూ ఏర్పడే నల్లటి మ‌చ్చ‌ల‌కు ఆలు రసాన్ని ప‌ట్టిస్తే మంచి ఫ‌లిత‌ం ఉంటుంది. ఆలును స్లైసుగా కోసి తరచూ మొహానికి అప్లై చేస్తుంటే చర్మపు మడతలు తగ్గుతాయి. అయితే స్త్రీలు అందాన్ని పెంచుకోవడం కోసం వేలు ఖర్చు పెట్టి బ్యూటీ ప్రోడక్ట్లను ఉపయోగించడంతో పాటు బ్యూటీ పార్లర్ ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. కానీ ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లో దొరికే బంగాళదుంపతో ఫేస్ ప్యాక్ ట్రై చేస్తే చాలు మెరిసిపోయే చర్మం మీ సొంతం అవ్వాల్సిందే. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బంగాళదుంపను మెత్తగా రుబ్బి రసం తీయాలి. ఈ రసంలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసి, 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై నల్లటి మచ్చలు తొలగిపోతాయి. బంగాల‌దుంపను క‌డిగి తురుముకుని ర‌సం తీయాలి.

ఈ ర‌సానికి ఒక క‌ప్ కాఫీ పొడి, స్పూన్ ట‌మాటో ర‌సం, నిమ్మ‌ర‌సం కొన్ని డ్రాప్స్ వేసుకోవాలి. అలాగే ఎవ‌ర్ యూత్ ఫీల్ ఆఫ్ మాస్క్ చిన్న ప్యాకెట్ ను క‌లుపుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని బాగా కలుపుకోవాలి. ముఖానికి కోటింగ్ వేసుకోవాలి. ఆరిన త‌ర్వాత మాస్క తీసివేయాలి. దీంతో ముఖంపై బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్ తొల‌గిపోయి కాంతివంతంగా త‌యారు అవుతుంది. రెగ్యూల‌ర్ గా ఇలా చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.