Site icon HashtagU Telugu

Beauty Tips: ఈ ఒక్కటి వాడితే చాలు రాత్రికి రాత్రే మీ ముఖం మెరిసిపోవడం ఖాయం?

Mixcollage 12 Jan 2024 07 07 Pm 7070

Mixcollage 12 Jan 2024 07 07 Pm 7070

మామూలుగా చాలామంది ముఖాన్ని అందంగా మార్చుకోవడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే రకరకాల బ్యూటీ ప్రోడక్ట్లను ఉపయోగించడంతో పాటు బ్యూటీ పార్లర్ ల చుట్టూ తిరుగుతూ వేలకు వేలు ఖర్చు చేస్తూ ఉంటారు. ఇంకొందరు హోమ్ రెమిడీలను ఆయుర్వేద చిట్కాలను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు అనుకోకుండా వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. దాంతో ముఖం అందంగా మారడం సంగతి పక్కన పెడితే అందరూ విహీనంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ ముఖాన్ని అందంగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అంతే కాకుండా ఇప్పుడు మేము చెప్పబోయే చిట్కా పాటిస్తే చాలు రాత్రి మీ ముఖం మెరిసిపోవడం ఖాయం. ఇందుకోసం మినప్పప్పును ఉపయోగించాలి. ఈ మినపప్పు క్రీమును తయారు చేసుకోవడం చాలా సులభం. దాని కోసం ఒక కప్పు మినప్పప్పును రాత్రంతా నానబెట్టుకోవాలి. మరుసటి రోజు ఆ పప్పును శుభ్రంగా కడగాలి. దానిని మెత్తని పేస్టులాగ మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న పేస్టును కాటన్ క్లాత్లో వేసి దానిని ఒక గిన్నెలో వేయాలి. ఆ వస్త్రాన్ని గట్టిగా పిండడం ద్వారా దాని నుండి పాల లాంటి నీరు వస్తుంది. ఇలా మొత్తం నీటిని పిండుకున్న తర్వాత దానిని ఒక పాన్ లో వేసుకుని స్టవ్ పై మెల్లగా వేడి చేసుకోవాలి. నీరు దగ్గరికి వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. ఆ పేస్టును గాజు గిన్నెలో నిల్వ చేసుకోవచ్చు.

ఈ పేస్టును ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖంపై ఉండే ముడతలు తొలిగిపోతాయి. మచ్చలు పోతాయి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.ఈ పేస్టును ముఖానికి పెట్టుకున్న తర్వాత నెమ్మదిగా మసాజ్ చేయాలి. చేతి వేళ్ల కొనల ద్వారా మర్దన చేసుకోవాలి. ఓ పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. అలా చేయడం వల్ల ముఖం కాంతి వంతంగా, అందంగా తయారవడమే కాకుండా మిల మిలా మెరిసిపోతుంది. అలాగే ఈ చిట్కాను ఉపయోగించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఈ చిట్కాను ఉపయోగించిన తర్వాత అందంలో మార్పును మీరే గమనించవచ్చు..

Exit mobile version