Beauty Tips: వృద్ధాప్య వయసులో కూడా యంగ్ గా కనిపించాలి అంటే వీటినే తినాల్సిందే?

మామూలుగా ప్రతి ఒక్కరూ కూడా అందంగా యవ్వనంగా యంగ్ గా కనిపించాలని కోరుకుంటు ఉంటారు. అందుకోసం చాలామంది రకరకాల ఫేస్ క్రీములు

  • Written By:
  • Publish Date - February 27, 2024 / 07:30 PM IST

మామూలుగా ప్రతి ఒక్కరూ కూడా అందంగా యవ్వనంగా యంగ్ గా కనిపించాలని కోరుకుంటు ఉంటారు. అందుకోసం చాలామంది రకరకాల ఫేస్ క్రీములు ఉపయోగించడం, ఫిట్నెస్ ను మెయింటైన్ చేయడం, సరైన ఆహార పదార్థాలు తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. వాటితో పాటుగా ఇప్పుడు మేము చెప్పబోయే కొన్ని రకాల ఆహార పదార్థాలు తరచూ తీసుకుంటే చాలు వయసు పెరుగుతున్నా కూడా మీ అందం ఏ మాత్రం తగ్గదు. అంతేకాకుండా వయసు మీద పడినా కూడా యంగ్ గా కనిపించడం ఖాయం. అయితే అందుకోసం తప్పకుండా కొన్ని రకాల పదార్థాలను నానబెట్టి క్రమం తప్పకుండా తీసుకోవాలి.

ఒక స్పూన్ మెంతులు రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినాలి. ఆ నీటిని తాగాలి. రోజు ఇలా చేయడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. వీటిలో పీచు అధికంగా ఉంటుంది. ఇది పేగులని శుభ్రపరచి మలబద్ధకం సమస్య నుంచి బయటపడేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. నెలసరి సమయంలో వచ్చే నొప్పులు కూడా తగ్గుతాయి. అలాగే అవిసె గింజలు వీటిలో పీచు యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ బి మాంసం కృత్తులు, ఒమేగా త్రీ ఫ్యాటి యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. రోజు నానబెట్టిన గింజలను తింటే బరువు తగ్గడంతో పాటు నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది.

ఇక అంజీరాలో కూడా ఏ, బి విటమిన్లు, క్యాల్షియం, మాంగనీస్, సోడియం, పొటాషియం పీచు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడి అనారోగ్య సమస్య లను తగ్గిస్తాయి. మెదడు పనితీరును చురుగ్గా ఉంచుతాయి. అధిక రక్తపోటును తగ్గిస్తాయి. అదేవిధంగా రోజు నానబెట్టిన ఐదారు బాదం తినడం వలన మెదడు చురుకుగా ఉంటుంది. వీటిలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ సమస్య తగ్గడంతో పాటు బరువు నియంత్రణలో ఉంటుంది. ఎండు ద్రాక్ష వీటిలో ఇనుము పుష్కలంగా ఉంటుంది. వీటిని నిత్యం తీసుకోవడం వలన చర్మం ఆరోగ్యంగా మారడంతో పాటు మీ చర్మం కాంతివంతంగా మారుతుంది. రోజు రాత్రిపూట 10 ,12 ఎండు ద్రాక్షలను నీటిలో నానబెట్టి ఉదయం తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇనుము సమృద్ధిగా అందుతుంది..