Site icon HashtagU Telugu

Hibiscus Flower for skin: మీ ముఖం మెరిసిపోవాలంటే మందార పువ్వులతో ఈ విధంగా చేయాల్సిందే?

Mixcollage 16 Jan 2024 06 46 Pm 1828

Mixcollage 16 Jan 2024 06 46 Pm 1828

మందార పువ్వు అందానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. కేవలం మందార పూలు మాత్రమే కాకుండా మందారం ఆకులు కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి. మార్కెట్లో దొరికే చాలా రకాల బ్యూటీ ప్రోడక్ట్లలో మందారం ఆకులు మందార పూలను వినియోగిస్తారు. కేవలం మార్కెట్లో దొరికే వాటితో మాత్రమే కాకుండా మందార పువ్వులతో మీరు చక్కటి హోం రెమిడీలను ఫాలో అయ్యి మీ అందాన్ని మరింత పెంచుకోవచ్చు. మరి మెరిసే చర్మం మీ సొంతం కావాలంటే మందార పూలతో ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మందార పువ్వులను బాగా ఎండ బెడితే పొడిలా అవుతుంది. ఈ పొడిలో టమాటా రసాన్ని కలిపి కాళ్లు, చేతులు, మెడ, ముఖానికి బాగా పట్టించి, 15 నిమిషాల తర్వాత ముఖం కడుక్కుంటే ఫేస్ కాంతి వంతంగా ఉంటుంది. మందార పువ్వును గ్రౌండ్ చేసి అలోవెరా జెల్‌ను కలపాలి. ఈ ఫేస్ ప్యాక్‌ ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత నార్మల్ వాటర్‌తో ముఖం కడుక్కుంటే జిడ్డు పోయి ఫేస్ క్లియర్‌గా ఉంటుంది. మందార ఆకులు పొడి అయ్యేంతవరకు ఎండలో ఎండ బెట్టాలి. ఈ పొడిలో ముల్తానీ మట్టి కలుపుకుని ముఖానికి అప్లే చేసుకోవాలి.

కావాలి అనుకున్న వారు పెరుగు కూడా కలుపుకోవచ్చు. ఇలా చేస్తే మీ ముఖం అందంగా మెరిసి పోతుంది. మందార పువ్వులతో స్క్రబ్‌ కూడా తయారు చేసుకోవచ్చు. మందార పువ్వుల పొడిలో కొద్దిగా పంచదార, శనగ పిండి, పాలు వేసి ముఖంపై సున్నితంగా స్క్రబ్ చేయండి. ఇలా చేస్తే ముఖంపై ఉండే ట్యాన్ అంతా పోయి ముఖం క్లియర్‌గా ఉంటుంది. ఇలా మందారంతో ఈ విధంగా చేస్తే చాలు ముఖం మెరిసిపోవడం ఖాయం