Site icon HashtagU Telugu

Beauty Tips: ఎల్లప్పుడూ యవ్వనంగా ఉండాలనుకుంటున్నారా.. అయితే ఈ సీక్రెట్ ను ఫాలో అవ్వాల్సిందే?

Mixcollage 01 Jan 2024 03 06 Pm 3491

Mixcollage 01 Jan 2024 03 06 Pm 3491

మామూలుగా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎప్పుడూ యవ్వనంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. వయసు మీద పడినా కూడా యంగ్ గా కనిపించాలని అనుకుంటూ ఉంటారు. మరీ ముఖ్యంగా అమ్మాయిలు ఎక్కువగా ఈ విధంగా కోరుకుంటూ ఉంటారు. ఇక వయసు మీద పడుతున్న కొద్ది అందాన్ని పెంచుకోవడం కోసం అమ్మాయిలు ఎన్నో రకాల చిట్కాలను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల చిన్న వయసులోనే పెద్దవారిలా కనిపిస్తూ ఉంటాం. తీసుకునే ఫుడ్ లిమిట్ లేకుండా తినడం, అలాగే టైం టు టైం తినకపోవడం, సరియైన నిద్ర లేకపోవడం, ఇలాంటివన్నీ అలాగే డైట్ సరిగా చేయకపోవడం, వలన 30 సంవత్సరాల వయసులో 60 సంవత్సరాలు వాళ్ళ లాగా కనిపిస్తూ ఉంటారు.

అధికంగా తినడం వల్ల అధిక బరువు పెరిగిపోవడం, ఊబకాయం లాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఇక యవ్వనంగా ఎలా కనిపిస్తారు. అయితే మనం యవ్వనంగా కనిపించాలి అంటే ఇవన్నీ పాటించాలి. మొదటగా ఉదయం లేవగానే ఏమి తినకుండా 9:00 వరకు ఉండటం అలాగే తొమ్మిది గంటల తర్వాత రెండు గ్లాసుల నీరును తీసుకోవడం ఆ తర్వాత పది నుంచి 11 గంటల మధ్యలో భోజనం చేయడం. ఆ తర్వాత తిన్న రెండు గంటల తర్వాత నీటిని త్రాగాలి. తర్వాత సాయంత్రం నాలుగు గంటల సమయంలో గ్రీన్ టీను త్రాగటం, ఈ గ్రీన్ టీను తాగడం, వలన శరీరంలో అనవసరమైన కొవ్వు కరిగి శరీరంలో మెటబాలిజంని ఉత్పత్తి చేస్తుంది. తర్వాత ఆరు ఏడు గంటల మధ్యలో ఫ్రూట్స్ ను ఒక నాలుగు, ఐదు రకాల పండ్లను సలాడ్ లాగా చేసుకుని తినాలి.

ఇలా తినడం వల్ల మన శరీరంలో అనవసరమైన కొవ్వు పెరగదు అలాగే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఎప్పటికీ యవ్వనంగా ఉంటారు. ప్రపంచంలో ఇప్పుడు అందరూ దీనిని ఫాలో అవుతున్నారు. ఇలా చేయడం వల్ల శరీరంలో ప్రతికణం కూడా దానంతట అదే శరీరాన్ని రిపేర్ అండ్ క్లీన్ చేసుకుంటూ ఉంటాయి దీనిని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు. ఈ మధ్యకాలంలో ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అన్నది ట్రెండింగ్ గా మారిపోయింది.