Site icon HashtagU Telugu

Beauty Tips: ముఖానికి ఇది రాస్తే చాలు ఎంత నల్లగా ఉన్న వారైనా తెల్లగా మారాల్సిందే?

Mixcollage 27 Dec 2023 04 31 Pm 9013

Mixcollage 27 Dec 2023 04 31 Pm 9013

మామూలుగా మనుషులు నలుపు,తెలుపు రంగులో ఉండడం అన్నది సహజం. మరికొందరు అంత నలుపుగా అంత తెలుపుగా కాకుండా చామంఛాయ రంగులో కూడా ఉంటారు. కొందరు నల్లగా ఉన్నామని బాధపడుతూ ఉంటారు. నలుగురి లోకి వెళ్ళాలి అన్నా కూడా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు. కాగా నల్లగా ఉన్నవారు తెల్లగా అవ్వడం కోసం అనేక రకాల చిట్కాలను ఉపయోగిస్తూ ఉంటారు. రకరకాల ఫేస్ క్రీములు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తప్ మంచి ఫలితాలు రాలేదని దిగులు చెందుతూ ఉంటారు. అయితే మీరు కూడా నల్లగా ఉన్నామని దిగులు చెందుతున్నారా.

ఇక మీదట అలా బాధపడాల్సిన అవసరం లేదు. మీకోసం ఒక అద్భుతమైన చిట్కాలు మీ ముందుకు తీసుకు వచ్చాం. మరి ఆ చిట్కాలు ఏంటి అన్న విషయానికి వస్తే.. ముందుగా బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న నిమ్మకాయలను తీసుకోవాలి. గ్రేటర్ సహాయంతో పై తొక్క మాత్రమే వచ్చే విధంగా తురుముకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో అరకప్పు బాదం నూనె వేసుకోవాలి. ఇప్పుడు దానిలో తురిమి పక్కన పెట్టుకున్న నిమ్మకాయ తొక్కలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఐదు నుంచి పది నిమిషాల పాటు నూనె మరగనివ్వాలి. నిమ్మ తొక్కలు నల్లగా అయ్యేంతవరకు నూనెను మరిగించుకోవాలి.

తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నూనెను కొద్దిసేపు చల్లారనివ్వాలి. తర్వాత ఏదైనా గాజు సీసాలోకి ఆయిల్ వడకట్టుకోవాలి. ఈ ఆయిల్ లో ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ముఖం, కాళ్లు, చేతులు, మెడ వంటి నల్లగా ఉండే ప్రదేశాలలో రాసుకొని పడుకోవాలి. ఈ నూనెను అప్లై చేసిన తర్వాత ఐదు నుంచి పది నిమిషాల దాకా స్మూత్ గా మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన రక్త ప్రసరణ బాగా జరిగి చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఈ విధంగా వరుసగా వారం రోజులపాటు చర్మానికి అప్లై చేసినట్లయితే చర్మం మునుపటి కంటే తెల్లగా మెరిసిపోతుంది. ఈ ఆయిల్ ఉపయోగించడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మంచి ఫలితం రావాలంటే ఈ మిశ్రమంలో ఒక స్పూన్ జోజోబా ఆయిల్ వేసి కలుపుకోవాలి. ఈ ఆయిల్ అమెజాన్ లో కానీ సూపర్ మార్కెట్ లో గాని లభిస్తుంది.