Site icon HashtagU Telugu

Beauty Tips: మొటిమల సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ సింపుల్ చిట్కాలను పాటించాల్సిందే?

Mixcollage 26 Dec 2023 06 03 Pm 2772

Mixcollage 26 Dec 2023 06 03 Pm 2772

మామూలుగా మనకు ఒక వయసు వచ్చేసరికి ముఖంపై మొటిమలు రావడం అన్నది సహజం. కొందరికి ముఖం అంతా కూడా మొటిమలు వచ్చి అందవిహీనంగా కనిపిస్తూ ఉంటారు. కొందరు ఆ మొటిమలు తాలూకా మచ్చలు అలాగే వాటి వల్ల గుంతలు ఏర్పడి ముఖమంతా కూడా గరుకుగా గుంతల గుంతలుగా కనిపిస్తూ ఉంటుంది. దాంతో చాలామంది వాటికోసం అనేక రకాల హోమ్ రెమిడిలను డ్యూటీ ప్రోడక్ట్లను ఉపయోగిస్తూ ఉంటారు. వాటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి.

అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖంపై మొటిమల సమస్యలను తగ్గించుకోవాలంటే అందుకోసం ఎటువంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ముఖంపై మొటిమల తగ్గించుకోవడానికి డ్రాగన్ ఫ్రూట్ ఎంతో బాగా ఉపయోగపడుతుంది. లోపల తెల్లని గుజ్జు మొత్తం తిన్న తర్వాత తొక్క పక్కన పెట్టుకోండి. ఆ తొక్క వల్ల ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. డ్రాగన్ ఫ్రూట్ తొక్కలో చాలా విటమిన్స్ ఉంటాయి. అయితే ఆ తొక్కలో ఉండే మెత్తని గుజ్జు వంటి పదార్థాన్ని తీసుకొని ఒక బౌల్ లో వేసుకొని ఆ గుజ్జులో ఒక చెంచా ఎవర్ యూత్ గోల్డెన్ ఫేషియల్ వేయాలి. ఫేషియల్ కొనడానికి బడ్జెట్ లేదు అంటే పచ్చి పాలను కూడా వేసుకోవచ్చు.

వీటన్నిటిని కలిపి ఒక మిశ్రమంలో తయారు చేసుకోండి. మీకు కావాల్సిన పేస్ క్రీమ్ రెడీ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి ముందు ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని తర్వాత తయారు చేసుకున్న మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసుకున్న మిశ్రమాన్ని ఒక 10 లేదా 15 నిమిషాలు ఆరనివ్వాలి. ఆపై చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి 1 లేదా 2 సార్లు చేయడం వలన మీ మొఖం పైన ఉండే నల్లని మచ్చలు పోయి మీ ముఖం అందంగా కాంతివంతంగా తయారవుతుంది .ఇలా చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కాని చర్మవ్యాధులు కానీ రావు. ఈ ట్రిక్ ని ఎలాంటి వయస్సు వారైనా ఉపయోగించవచ్చు.