Site icon HashtagU Telugu

Beauty Tips: ముఖంపై మొటిమలు మచ్చల సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఒక్కసారి ఇది అప్లై చేయాల్సిందే?

Mixcollage 28 Dec 2023 05 12 Pm 2777

Mixcollage 28 Dec 2023 05 12 Pm 2777

ఈ రోజుల్లో చాలామంది ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా యువత అనేక రకాల కారణాలవల్ల ముఖంపై ఈ మొటిమలు మచ్చల సమస్యలతో తెగ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ మొటిమల కారణంగా ముఖం అంతా కూడా అందవిహీనంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఆ మొటిమలను మచ్చలను తగ్గించుకోవడానికి చాలా మంది బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతూ వేలకు వేలు డబ్బులు ఖర్చు చేస్తుంటారు. అయినా ముఖంలో ఎటువంటి మార్పు కనబడక దిగులు చెందుతూ ఉంటారు. అంతేకాకుండా బ్యూటి ప్రోడక్ట్స్ వలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

కనుక ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలు తగ్గాలంటే ఇప్పుడు చెప్పే రెండు చిట్కాలను తెలుసుకోవాల్సిందే. మొదటి ఫేస్ ప్యాక్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా 20 ఎంఎల్ బాదం పాలు తీసుకోవాలి. బాదం నానబెట్టి కొన్ని నీటిని పోసి మిక్సీ పట్టి దాన్ని వడకట్టగా వచ్చిన పాలను బాదంపాలు అంటారు. దీనికి 10 ఎంఎల్ రోజ్ వాటర్ ని కలపాలి. తర్వాత ఇందులో రెండు లేదా మూడు స్పూన్ల కలబంద గుజ్జును కలపాలి. తర్వాత ఇందులో బాదం నూనె పది చుక్కలు కలపాలి. ఇది మార్కెట్లో సులువుగా దొరుకుతుంది. తర్వాత విటమిన్ ఈ క్యాప్సిల్ లోపల సిరంను కలపాలి. ఈ ఐదు మిశ్రమాలను కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకోవాలి. ఇది చర్మాన్ని డిహైడ్రేడ్ కాకుండా రక్షిస్తుంది.

అలాగే స్కిన్ స్మూత్ గా చేయడానికి, మచ్చలు తొలగించడానికి, మొటిమల దగ్గర ఉండే బ్యాక్టీరియాలను తొలగించడానికి, జిడ్డును తొలగించడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్యాక్ ముఖానికి అప్లై చేసుకుని ఒక అరగంట సేపు ఉంచుకోవాలి. తర్వాత శుభ్రంగా నీటితో కడుక్కోవాలి. దీని వలన పింపుల్స్ కొద్ది రోజుల్లోనే తగ్గిపోతాయి. కనుక బయట కెమికల్స్ ఏమి ఉపయోగించకుండా ఈ నేచురల్ ప్యాక్ ని ఉపయోగిస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇక రెండవ చిట్కా విషయానికి వస్తే.. అలోవెరా జెల్ బాగా ముఖానికి రాసుకొని ఒక 20 నిమిషాల పాటు ఉంచుకుంటే ఇది యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేసి స్కిన్ చాలా సాఫ్ట్ గా స్మూత్ గా చేస్తుంది. అలాగే ఇన్ఫెక్షన్ కూడా తగ్గిస్తుంది. ఇలా రోజు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. దీని వలన చర్మం లో ఉన్న వ్యర్ధాలు అన్ని బయటకి వస్తాయి. కాబట్టి ఈ రెండు చిట్కాలను ఉపయోగించారంటే ఎటువంటి మచ్చలు లేకుండా ముఖం అందంగా తయారవుతుంది.