Site icon HashtagU Telugu

Beauty Tips: ముఖం నల్లగా ఉందని బాధపడుతున్నారా.. ఈ సింపుల్ చిట్కాతో తెల్లగా అవ్వడం ఖాయం?

Mixcollage 24 Dec 2023 04 03 Pm 7816

Mixcollage 24 Dec 2023 04 03 Pm 7816

మాములుగా స్త్రీ పురుషులు ప్రతి ఒక్కరు కూడా అందంగా కనిపించాలని అనుకుంటూ ఉంటారు. ఇక అందాన్ని మెయింటైన్ చేయడం కోసం ఎన్నో రకాల చిట్కాలను కూడా పాటిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా స్త్రీలు మార్కెట్లో దొరికే ఎన్నో రకాల బ్యూటీ ప్రొడక్ట్లను ఉపయోగిస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు వాటి కారణంగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావచ్చు. అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మెరిసిపోయే చర్మం కావాలంటే చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఇందుకోసం ముందుగా ఒక ఫ్రెష్ గా ఉన్న బీట్రూట్ తీసుకొని పైన తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలను మిక్సీ జార్లో వేసి నీళ్లు వేసుకోకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్ ను ఏదైనా గుడ్డ సహాయంతో జ్యూస్ ను వడకట్టుకోవాలి. వడకట్టుకున్న జ్యూస్ ను గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టి దగ్గర అయ్యేంతవరకు మరిగించుకోవాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి దానిలో బియ్యం పిండిని కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. ఇది పేస్ట్ లా కాకుండా డ్రైగా అయ్యేంతవరకు వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. తర్వాత ఈ పిండిని 24 గంటలపాటు ఆరనివ్వాలి. తర్వాత ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి.

ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో సరిపడినంత పౌడర్ వేసుకోవాలి. దాంట్లో ఒక స్పూన్ రోజ్ వాటర్ వేసుకోవాలి. రోజ్ వాటర్ బయటి మార్కెట్లలో దొరుకుతుంది. తరువాత ఇందులో ఒక స్పూన్ అలోవెరా జెల్ వేసుకోవాలి. ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి. మగవారు అయితే ఇలా అప్లై చేసుకోవచ్చు. ఆడవారు అయితే ఒక స్పూన్ కస్తూరి పసుపు వేసుకోవాలి. ప్యాకెట్ పసుపు అస్సలు వేసుకోకూడదు. బాగా కలుపుకొని ముఖానికి బాగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత కొద్దిసేపు ఆరనిచ్చి స్మూత్ గా మసాజ్ చేయాలి. తర్వాత నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేయడం వలన ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతోంది. ముఖంపై ఉంటే నల్లని మచ్చలు, పింపుల్స్, డార్క్ సర్కిల్స్ వంటి సమస్యలు తగ్గుతాయి.