Site icon HashtagU Telugu

‎Ice Cubes for Skin: రాత్రి నిద్రపోవడానికి ముందు ముఖానికి ఐస్ క్యూబ్స్ అప్లై చేస్తే ఏమవుతుందో మీకు తెలుసా?

Ice Cubes For Skin

Ice Cubes For Skin

‎Ice Cubes for Skin: ఐస్ క్యూబ్స్ చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తరచుగా వినియోగించడం వల్ల చర్మ సమస్యలు నయం అవుతాయని చెబుతున్నారు. ముఖ్యంగా రోజుకు ఒకసారి ఐస్ క్యూబ్స్ ఉపయోగిస్తే చర్మానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుందట. మంచి చర్మం కోసం చాలా మంది ఐస్ క్యూబ్స్ ని పెద్ద మొత్తంలో ఉపయోగిస్తారు. అయితే నిజంగానే ఐస్ క్యూబ్స్ చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయా లేదా అన్న విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

‎మంచి చర్మం కావాలంటే రోజుకు ఒకసారి ఐస్ క్యూబ్స్ వాడాలట. ఐస్ క్యూబ్స్ చర్మ సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయని,అంతేకాకుండా చర్మం పొడిబారదని చెబుతున్నారు. ఐస్ క్యూబ్స్ తయారు చేయడానికి కలబంద సహాయం కూడా తీసుకోవచ్చట. ఐస్ క్యూబ్స్ కు కలబందను జోడించడం వల్ల మరింత ప్రయోజనకరంగా ఉంటుందట. స్క్రబ్బింగ్ తర్వాత ఐస్ క్యూబ్స్ వాడితే ఉపశమనంగా ఉంటుందని చెబుతున్నారు. అలాగే రాత్రి పడుకునే ముందు ఐస్ క్యూబ్స్ చర్మానికి అప్లై చేయడం చాలా మంచిదట.

‎ఇది చర్మం కొన్ని గంటల పాటు ప్రశాంతంగా ఉండటానికి సహాయపడుతుందట. ముఖం మీద చర్మం చికాకుగా ఉంటే ఐస్ క్యూబ్స్ ప్రయోజనకరంగా ఉంటాయని చెబుతున్నారు. అలాగే రోజుకు ఒకటి కంటే ఎక్కువసార్లు ఐస్ క్యూబ్స్ వాడకపోవడమే మంచిదని చెబుతున్నారు. మీరు చర్మానికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నట్లయితే ముందుగా నిపుణుల సలహా తీసుకొని ఆ తర్వాత ఐస్ క్యూబ్స్ ని వాడటం మంచిది. అలాగే చర్మానికి మంచిదే కదా అని ఐస్ క్యూబ్స్ ని ఎక్కువ మొత్తంలో వినియోగించకపోవడమే మంచిది. ముఖంపై మొటిమల వ‌ల్ల నొప్పితో చిరాకు పెడుతుంది. ఒక అప్పుడు మెత్తని గుడ్డలో ఐస్ ముక్కల్ని ఉంచి నొప్పి పెడుతున్న భాగంలో అద్దడం వల్ల మొటిమలు తగ్గుతాయట. ఐస్ ముక్కల తో ఫేషియల్ చేసినట్టు మొహం పైన రుద్దితే మొహం ఫ్రెష్ గా మెరుస్తుంది. ఐస్‌ను అప్లై చేయడం వల్ల చర్మ కణాలలో ఉండే సెబమ్‌ను నియంత్రించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు.

Exit mobile version