Site icon HashtagU Telugu

Sandalwood: ముఖంపై ముడతలు,మచ్చలు తగ్గి ముఖం మెరిసిపోవాలంటే చందనంతో ఇలా చేయాల్సిందే?

Mixcollage 01 Feb 2024 01 18 Pm 694

Mixcollage 01 Feb 2024 01 18 Pm 694

అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి చందనం నీ ఎప్పటినుంచో వినియోగిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా చందనాన్ని ఎన్నో రకాల బ్యూటీ ప్రోడక్ట్ లలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ చందనాన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖ సౌందర్యం మరింత పెంచుతుంది. చందనాన్ని ఉపయోగించి మన సౌందర్యాన్ని మరింత పెంచుకోవచ్చు. చందనంకి సహజమైన సౌందర్య మూలికగా పేరుంది. అయితే, ఈ చందనాన్ని పాలతో కలిపి రాస్తే వాటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చందనాన్ని పాలలో కలిపి రాయడం చాలా మంచిది.

దీని వల్ల సహజసిద్ధమైన లాభాలు ఉన్నాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది. ట్యాన్ తగ్గుతుంది. మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. చాలా మందికి ఏజ్ పెరిగే కొద్దీ చర్మంపై మచ్చలు, మొటిమలు, పిగ్మంటేషన్ వంటి సమస్యలు వస్తాయి. అలాంటి వారు పాలు, గంధం కలిపి రాయడం వల్ల ఈ సమస్య తగ్గి చక్కగా మెరుస్తారు. పాలు, గంధం కలిపి రాస్తే చర్మంపై ఉన్న మృతకణాలు తొలగి, గీతలు, చారలు తగ్గి సహజ కాంతి అందుతుంది. చర్మం చల్లగా అందంగా మారుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మాన్ని పొడిబారకుండా చేస్తుంది. తేనె కూడా చర్మాన్ని కాపాడడంలో కీ రోల్ పోషిస్తుంది.

అందుకోసం కొద్దిగా చందనంలో తేనె కలిపి రాయాలి. రెండింటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని యవ్వనంగా కాపాడుతుంది. చక్కగా మెరిసేలా చేస్తుంది. అలాగే ఆలివ్ ఆయిల్‌తో కలిపి చందనాన్ని రాయడం వల్ల ముడతలు తగ్గుతాయి. ఆలివ్ ఆయిల్‌లో ఎక్కువగా గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. దీంతో పాటు చందనంలోని గొప్ప గుణాలు ఆయిల్‌తో మిక్స్ అయి చక్కని లాభాలు అందుతాయి.​