Site icon HashtagU Telugu

Chrysanthemum: అందం రెట్టింపు కావాలంటే చామంతితో ఇలా చేయాల్సిందే ?

Chrysanthemum

Chrysanthemum

సాధారణంగా పూలని పూజకు ఉపయోగిస్తారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. లేదంటే మహిళలు పెట్టుకునేందుకు పూలను ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు వేదికలను అలంకరించడం కోసం ఈ పూలను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఎప్పుడు ఎన్నో రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఉదాహరణకు రోజ్ వాటర్ ని తీసుకోవచ్చు. అలా అని అన్ని రకాల పూలు అందాలకు ఉపయోగపడతాయి అని చెప్పలేం.

అలా అందానికి ఉపయోగించే పూలలో చామంతి కూడా ఒకటి. అందాన్ని రెట్టింపు చేయడం కోసం చామంతి పూలను ఉపయోగిస్తూ ఉంటారు. చామంతి పూలతో చేసే టీ తో అందాన్ని మరింత పెంచుకోవచ్చు. చామంతితో తయారు చేసిన టీని ముఖానికి రాసుకొని కొద్దిసేపు ఆరనివ్వాలి. దాంతో చర్మం తక్షణ ఉపశమనం పొందుతుంది. అంతేకాకుండా కాలికి చేతులకు గాయాలు అలాగే దోమ కాటు వల్ల వచ్చే దద్దుర్లు కూడా చామంతి టీ వల్ల తగ్గుతాయి. చర్మంపై పేరుకున్న టాన్‌ ముఖాన్ని కాంతివిహీనంగా మార్చేస్తుంది. ఇది చర్మ ఛాయను మెరుగుపరిచి అందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. ఇది చర్మాన్ని బిగుతుగా చేస్తుంది.

ఫలితంగా ముఖంపై ఏర్పడే మచ్చలు వంటివి తగ్గుముఖం పడతాయి. నిద్రలేమి, పని ఒత్తిడి ఇతరత్రా కారణాలు కళ్లకింద వాపు వస్తుంది. మరి కొంతమందికి కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు చామంతి టీ బ్యాగులని ఫ్రిజ్‌లో ఉంచి మూసిన కనురెప్పలపై ఉంచితే సమస్య దూరమవుతుంది. అలాగే కంటి అలసట కూడా తగ్గుతుంది. కళ్లకింద ఏర్పడే నల్లటి వలయాలు దూరమవుతాయి. ఇందుకోసం కప్పున్నర పాలపొడికి, అరకప్పు చామంతి టీని చేర్చి మెత్తగా కలపాలి. దీన్ని ఒంటికి పట్టించి నలుగులా రుద్దాలి. ఇది సహజ స్క్రబ్‌లా పనిచేస్తుంది. పావుకప్పు గోరింటాకు పొడికి చామంతి టీని చేర్చి నానబెట్టాలి. దీన్ని నాలుగైదు గంటల తరవాత తలకు పట్టించి మరో గంట ఆరనివ్వాలి. ఆపై తలస్నానం చేస్తే జుట్టుకి తగిన పోషణ అందుతుంది.