Site icon HashtagU Telugu

Beauty Tips: చర్మం మెరిసిపోవాలంటే అరటిపండుతో ఇలా చేయాల్సిందే?

Beauty Tips

Beauty Tips

అరటిపండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అరటిపండు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అరటిపండు ఉపయోగించి చర్మ సౌందర్యాన్ని కూడా రెట్టింపు చేసుకోవచ్చు. మరి అరటిపండుతో చర్మ సౌందర్యాన్ని ఎలా రెట్టింపు చేసుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అరటిపండులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో కెమికల్స్ అలాగే తేమ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ పండు పొడిచర్మానికి పోషణను అందించి, కఠినంగా మారిన చర్మాన్ని మృదువుగా మార్చి, వయస్సు పైబడే లక్షణాలపై కూడా పనిచేస్తుంది.

మీకు మొటిమలు వచ్చే అవకాశం ఉన్న చర్మం ఉన్నట్లయితే, ఇకపై రాకుండా జిడ్డుని తగ్గించడానికి మీరు ఈ పండుని వాడవచ్చు. అరటిపండులో ఎక్కువ విటమిన్ సి ఉంటుంది, ఇది చర్మం యొక్క సహజకాంతిని తగ్గకుండా అలానే ఉంచుతుంది. మరి ఇందుకోసం ఏం చేయాలి అన్న విషయానికొస్తే..బాగా పండిన అరటిపండులో సగాన్ని మెత్తగా చిదిమి,1 చెంచా గంధం, ½ చెంచా తేనెను వేయాలి. ఈ మిశ్రమాన్ని మొహానికి పెట్టుకుని 20 నుండి 25 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ ఫేసు మాస్క్ జిడ్డు చర్మం ఉన్నవారికి ఎక్కువ ఉపయోగం. ఎందుకంటే ఇందులోని గంధం ఎక్కువ చర్మనూనె అలాగే నూనెపదార్థాలను తొలగించితే, అరటిపండు దాన్ని తేమగా ఉంచుతుంది.

ఒక పండిన అరటిపండుని చిదిమి అందులో కాస్తా నిమ్మరసం కలపాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని 20 నిమిషాలపాటు అలాగే వదిలేయాలి. ఈ మాస్కులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, ఇది ముఖంలో అలసటని, మచ్చలని తొలగిస్తుంది. మీరు ముఖానికి అరటిపండు, పాల మిశ్రమాన్ని ప్రయత్నించవచ్చు. ఒక పండిన అరటిపండుని బాగా చిదమండి. అంతే పరిమాణంలో పాలను వేసి బాగా కలపండి. మీది పొడిచర్మం అయితే, ఆలివ్ నూనె చుక్కలను కూడా కొన్ని వేయవచ్చు. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి, మెడకి రాసి 20 నిమిషాలపాటు వదిలేయండి. ఆ సమయంలో మీరు బహుశా ఇంకొక అరటిపండుని తిని విశ్రాంతి తీసుకోవచ్చు. చర్మానికి అరటిపండు మంచి పోషణ ఇస్తుంది. వీటిల్లో పొటాషియం, తేమ ఎక్కువగా ఉంటాయి.

అవి పొడిబారిన చర్మానికి తేమ అందించి, మెత్తగా మృదువుగా మారుస్తుంది. అరటిపండులోని విటమిన్ ఎ తేమని తిరిగి తీసుకొస్తుంది. పొడిబారిన చర్మాన్ని మృదువుగా మార్చి, చర్మాన్ని బాగుచేస్తుంది. వయసు పైబడే లక్షణాలను తగ్గించే లాభాలు ఉంటాయి. అరటి పండులోని పోషకాలు ముడతలతో పోరాడి, చర్మాన్ని యవ్వనవంతంగా ఉంచుతాయి. విటమిన్ ఎ ఇ లతో నిండిన యాంటీ ఏజింగ్ ఫేషియల్ మాస్క్ తయారుచేయడానికి, ఒక అవకాడో, అరటిపండును కలిపి మెత్తగా చిదమండి. ఈ మిశ్రమాన్ని మీ చర్మంపై 20 నిమిషాలు వదిలేసి తర్వాత కడగండి. మీ చర్మం మృదువుగా, యవ్వనవంతంగా మారుతుంది. అవకాడోలోని విటమిన్ ఇ, అరటిలోని పోషకాలు కలిసి ఫ్రీ రాడికల్స్ తో పోరాడి, పాడైన చర్మాన్ని బాగుచేస్తాయి.