Beard Grow Tips: ప్రతిరోజు రెండుసార్లు ఇలా చేస్తే చాలు మీ గడ్డం గుబురుగా పెరగాల్సిందే?

ప్రస్తుత రోజుల్లో మగవారు ఎక్కువగా గడ్డాన్ని పెంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. ప్రతి ఒక్క పురుషుడు కూడా గుబురుగా ఉన్న గడ్డాన్ని ఎక్కువగా ఇష్టప

  • Written By:
  • Publish Date - December 2, 2023 / 04:45 PM IST

ప్రస్తుత రోజుల్లో మగవారు ఎక్కువగా గడ్డాన్ని పెంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. ప్రతి ఒక్క పురుషుడు కూడా గుబురుగా ఉన్న గడ్డాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కొందరికి గడ్డం బాగా వచ్చి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటారు.. ఇంకొందరికి మాత్రం సగం వచ్చి సగం రాక అనేక ఇబ్బందులు పడుతుంటారు. ఇంకొందరికి అయితే వయసు మీద పడుతున్న కూడా సరిగా మీసాలు గడ్డాలు రాక దిగులు చెందుతూ ఉంటారు. కదా మగవారి అందాన్ని రెట్టింపు చేసే వాటిలో గడ్డం కూడా ఒకటి అన్న విషయం మనందరికీ తెలిసిందే.

అయితే మీరు కూడా గడ్డం రాలేదని దిగులు చెందుతున్నారా, గడ్డం రావడం కోసం అనేక రకాల బ్రీడ్ ఆయిల్స్ ని ఉపయోగిస్తున్నారా, అయితే ఇది మీ కోసమే. చాలామందికి గడ్డం పూర్తిగా పెరగదు కొన్ని ప్రాంతాల్లో గడ్డం పెరిగితే మరికొన్ని ప్రాంతాల్లో ఫేస్ మీద గడ్డం పెరగదు. కొంత మందికైతే అసలు గడ్డం 25 ఏళ్ళు 26 ఏళ్ళు వచ్చినా కూడా మొలకెత్తుదు. మరి అటువంటి వారు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మామూలుగా చాలామంది గడ్డం షేవ్ చేసుకునేటప్పుడు పైనుంచి కిందికి షేవ్ చేసుకుంటూ ఉంటారు. కానీ అలా చేయకుండా అడ్డంగా కుడి నుంచి ఎడమకి ఎడమ నుంచి కుడికి షేవ్ చేసుకుంటే కూడా గడ్డం పెరుగుదలలో కూడా మార్పు కనిపిస్తుంది.

ఆము దాన్ని వాడిన లేదంటే ఆముదం కలిపిన క్రీమ్స్ కానీ యూస్ చేసిన కూడా గడ్డం పెరుగుదలలో మార్పు వస్తుంది. ఆలివ్ ఆయిల్ కూడా గడ్డాన్ని పెంచడం బాగా ఉపయోగపడుతుంది. అలాగే కొబ్బరినూనె మసాజ్ చేయించుకోవడం, పొగ తాగటం మానేయటం, స్ట్రెస్ లేకుండా ఉండటం మంచిగా నిద్రపోవటం ఇవన్నీ కూడా మీకు గుబురు గడ్డం పెరగడానికి కారణాలు అవుతాయి. అలాగే టొమాటో, అలోవెరా జెల్, ఆముదం, కలోంజీ సీడ్స్ వీటిని నల్ల జీలకర్ర అని కూడా అంటారు. ఒక టమాటా గుజ్జు ఒక హాఫ్ స్పూన్ కలబంద గుజ్జు, ఒక హాఫ్ స్పూన్ ఆముదం, ఒక హాఫ్ స్పూన్ కాలోజీ సీడ్స్ పొడి వీటన్నింటిని మెత్తగా కలుపుకోవాలి. అలా కాసేపు కలుపుకున్న తర్వాత మీకు ఎక్కడైతే ప్యాచి వీడు ఉంటుందో లేకపోతే ఎక్కడైతే ఈ హెయిర్ గ్రోత్ లేదు అని మీరు ఫీల్ అవుతున్నారో అక్కడ దీన్ని రాసి మర్దన లాగా చేయాలి. ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు కింద నుంచి పైకి మర్దన లాగా చేసిన తర్వాత ఆ రాత్రి అంతా అలాగే వదిలేయాలి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఈ రెమెడీని ఫాలో అయితే మీ గడ్డం పెరుగుదలలో మార్పు కనిపిస్తుంది.