Site icon HashtagU Telugu

Beans Fry: ఎంతో టేస్టీగా ఉండే బీన్స్ ఫ్రై.. ఇలా చేస్తే చాలు కొంచం కూడా మిగలదు?

Mixcollage 04 Jan 2024 04 48 Pm 5657

Mixcollage 04 Jan 2024 04 48 Pm 5657

మన వంటింట్లో దొరికే కూరగాయలలో ఒకటి. ఈ బీన్స్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ బీన్స్ ని ఉపయోగించి అనేక రకాల వంటకాలు కూడా తయారు చేస్తూ ఉంటారు. వెజిటేబుల్ బిర్యాని లోకి కూడా వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. చాలామంది బీన్స్ ఫ్రై ట్రై చేయాలి అనుకున్నప్పటికీ కొంతమందికి పర్ఫెక్ట్ గా చేయడం రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి బీన్స్ ఫ్రైని టేస్టీగా ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు:

చిన్నగా తరిగిన బీన్స్ – పావు కిలో
పసుపు – పావు టీ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
నీళ్లు -పావు కప్పు
శనగపప్పు – 2 టేబుల్ స్పూన్స్
ఎండు మిర్చి – 6
జీలకర్ర – 1 టీస్పూన్
నూనె – 1 టేబుల్ స్పూన్
తాళింపు దినుసులు – 1 టేబుల్ స్పూన్
కరివేపాకు – 1 రెమ్మ
పచ్చికొబ్బరి తురుము – పావు కప్పు
తరిగిన – కొత్తమీర కొద్దిగా

తయారీ విధానం:

ముందుగా జార్ లో శనగపప్పు, ఎండుమిర్చి, జీలకర్ వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. కడాయిని స్టవ్ మీద పెట్టి బీన్స్, పసుపు, ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు మూతపెట్టి ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించాలి. తర్వాత మూత తీసి నీరంత పోయేవరకు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేసుకోవాలి. తర్వాత తాళింపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి వేయి వేయించాలి.
తర్వాత మిక్సీ పట్టుకుని శనగపప్పు మిశ్రమం వేయాలి. తర్వాత ఉడికించి బీన్స్ వేసి వేయించుకోవాలి. వీటిపై మూత పెట్టి మరో రెండు నిమిషాల పాటు వేయించాలి. తర్వాత పచ్చికొబ్బరి తురుము వేసి కలపాలి. తర్వాత కొత్తమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే బీన్స్ ఫ్రై రెడీ..