Face Serum: ఫేస్ సీరమ్ వాడుతున్నారా..? ఏది మంచిదో తెలుసా..?

ఈ మధ్యకాలంలో చాలామంది చర్మ సౌందర్యంపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే చర్మాన్ని సంరక్షించుకునేందుకు ఏవేవో క్రిములు వాడుతున్నారు.

  • Written By:
  • Updated On - February 4, 2022 / 04:19 PM IST

ఈ మధ్యకాలంలో చాలామంది చర్మ సౌందర్యంపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే చర్మాన్ని సంరక్షించుకునేందుకు ఏవేవో క్రిములు వాడుతున్నారు. అయితే ప్రస్తుతం చాలామంది నచ్చుతున్న, మెచ్చుతున్న వాటిల్లో ఫేస్ సీరమ్ ఒకటి. ఈ ఫేస్ సీరిమ్ ను ప్రతిరోజు ఉపయోగించడం వల్ల…ముఖంపై కాంతిని తీసుకువస్తుంది. అంతేకాద…యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. ఈ సీరమ్ వాడటం వల్ల మన చర్మానికి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి…ఎలాంటి ఫేస్ సీరమ్ వాడలో ఓసారి తెలుసుకుందాం.

విటమిన్ సి ఫేస్ సీరమ్: ఇది వృద్ధాప్య ఛాయల్ని కనిపించకుండా సాయం చేస్తుంది. మూడు పదుల వయస్సు దాటిన వారంతా కూడా దీనిని వాడవచ్చు. కొలాజెన్ స్థాయిలను పెంచడంతోపాటు ముఖంపై కాంతిని ప్రకాశింపజేస్తుంది.

యాంటీ ఆక్సిడెంట్లు సీరమ్: కాలుష్యం వల్ల దెబ్బతిన్న చర్మాన్ని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడంలో సహాయపడుతుంది. కాలుష్యం నుంచి చర్మాన్ని రక్షించుకునేందుకు బాటా కెరొటిన్, గ్రీన్ టీ, బెర్రీలు, దానిమ్మ, ద్రాక్షగింజల సమ్మేళనాలను తీసుకోవల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా సీరమ్ లో పుష్కలంగా లభిస్తాయి.

హ్యాలురోనిక్ ఆసిడ్ సీరమ్ : చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. సెరమైడ్స్ , అమైననో ఆసిడ్స్, చర్మాన్ని సహజంగా మ్రుదువుగా కనిపించేలా చేస్తాయి.

ప్లాంట్ బేస్డ్: దీనిలో లికోరైస్ గుణాలుంటాయి. చర్మం నిర్జీవంగా ఉండేవారు…దీనిని ఎంచుకోవడం మంచిది. పిగ్మెంటేషన్, మొటిమల వల్ల వచ్చే మచ్చలను తొలగించడంలో సహాయం చేస్తుంది.

యాంటీ ఇన్ ఫ్లమేటరీ : సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్లు…ఈ సీరమ్ ను సెలక్ట్ చేసుకోవచ్చు. అలొవెరా, ఆర్నికా, జింక్ వంటి గుణాలతో దీనిని తయారు చేస్తారు. చర్మాన్ని మ్రుదువుగా ఉంచడమే కాకుండా మొటిమలు రాకుండా చేస్తుంది.

రెటినాల్స్ సీరమ్ : కొంతమందికి వయస్సుతో సంబంధం లేకుండా మొటిమలు వేధిస్తుంటాయి. అంతేకాదు చర్మంపై దద్దుర్లు వేధిస్తుంటాయి. కాలుష్యం వల్ల ముడతలు కూడా వస్తుంటాయి. అలాంటి వారు రెటినాల్స్ సీరమ్ ను వాడటం మంచిది.