Site icon HashtagU Telugu

Banana Kheer : అరటిపండుతో పాయసం.. ఇలా చేస్తే టేస్ట్ సూపర్ అంతే..

Banana Kheer

Banana Kheer

Banana Kheer : బనానా ఖీర్. అరటిపండుతో చేసే స్వీట్ ఇది. ఎప్పుడైనా అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే.. వెంటనే అరటిపండుతో దీనిని వండుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. సాయంత్రం వేళలో పిల్లలకు దీనిని తినిపిస్తే బలంగా ఉంటారు. మరి ఈ బనానా ఖీర్ ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

బనానా ఖీర్ రెసిపీకి కావలసిన పదార్థాలు

అరటిపండ్లు – 2

పాలు – 2 కప్పులు

యాలకులపొడి – 1/2 స్పూన్

కుంకుమపువ్వు రేకులు – 2

బెల్లం తురుము – 1/2 కప్పు

నట్స్ – గుప్పెడు

బనానా ఖీర్ రెసిపీ

ముందుగా స్టవ్ పై ఒక గిన్నెు పెట్టి.. అందులో పాలుపోసి చిన్నమంటపై వేడి చేయాలి. అవి కాస్త చిక్కబడేంత వరకూ మరిగించాలి. ఇప్పుడీ పాలల్లో యాలకులపొడి, డ్రై ఫ్రూట్స్, కుంకుమపువ్వు రేకులు వేసి మరిగించాలి.

మరొక గిన్నె తీసుకుని.. అందులో అరటిపండును మెత్తగా మెదుపుకోవాలి. మిక్సీలో వేసి మెత్తగా చేసుకున్నా చాలు. మరుగుతున్న పాలల్లో బెల్లం తురుమును వేసి కలుపుకోవాలి. ఇప్పుడీ మిశ్రమం కాస్త చిక్కగా అయ్యాక స్టవ్ ను ఆఫ్ చేసుకోవాలి. చేతితో బాగా మెదుపుకున్న అరటిపండును పాలల్లో వేసి కలుపుకోవాలి.

ముందుగా నేతిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ను చల్లుకోవాలి. అంతే బనానా ఖీర్ రెడీ అయినట్లే. ఈ బనానా ఖీర్ ఎంతో రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. రెసిపీ తెలిసింది కదా.. మీరు కూడా ట్రై చేయండి.

అరటిపండ్లు శరీరానికి ఇన్ స్టంట్ ఎనర్జీని ఇస్తాయి. మిగతా పండ్లతో పోలిస్తే వీటలో షుగర్ లెవల్స్ ఎక్కువ కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు అరటిపండ్లను, వాటితో వండే ఆహారాలను తినకపోవడమే మంచిది. అరటిపండ్లలో పొటాషియం ఉంటుంది. కండరాలకు మంచిది. అలాగే హై బీపీని కంట్రోల్ లో ఉంచుతుంది.

Also Read : Fish Eyes Benefits : చేపకళ్లను పారేస్తున్నారా ? ఈ విషయాలు తెలిస్తే వదలకుండా తింటారు..