Site icon HashtagU Telugu

Banana for Hair Growth: జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలి అంటే అరటిపండు ఉపయోగించాల్సిందే?

Mixcollage 04 Feb 2024 08 26 Pm 7466

Mixcollage 04 Feb 2024 08 26 Pm 7466

అరటి పండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అరటిపండు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అందుకే తరచుగా వైద్యులు అరటిపండును తీసుకోవాలని చెబుతూ ఉంటారు. అరటిపండు చర్మ సౌందర్యాన్ని పెంచడంతోపాటు జుట్టుకు సంబంధించిన అనేక రకాల సమస్యలను పరిష్కరిస్తుంది. అటువంటి వాటిలో జుట్టు రాలడం తగ్గించి జుట్టును ఒత్తుగా బలంగా పెంచడం కూడా ఒకటి. మరి జుట్టు బలంగా పెరగాలంటే అరటి కాయతో ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఇందుకోసం ముందుగా రెండు పండిన అరటిపండ్లను గుజ్జుగా చేయండి. ఆ గుజ్జులో పెరుగు మిక్స్‌ చేయాలి.

స్కాల్ప్‌కు, జుట్టుకు అప్లై చేసి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తరువాత గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే కుదుళ్లు దృఢంగా మారతాయి. జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. పెరుగులోని పోషక విలువలు జుట్టును మృదువుగా, పట్టులా ఉంచుతాయి.​ అరటి, బొప్పాయిని గుజ్జుగా చేసి దానిలో తేనె మిక్స్‌ చేయాలి. ఈ పేస్ట్‌ను స్కాల్ప్‌కు, జుట్టుకు అప్లై చేసి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఇలా వారానికి రెండు సార్లు అప్లై చేస్తే జుట్టు వేగంగా పెరుగుతుంది. ఈ ప్యాక్‌లోని ఫోలిక్‌ యాసిడ్‌ జుట్టుకు పోషణ అందించి ఆరోగ్యంగా ఉంచుతుంది. బాగా మగ్గిన అరటిపండు ఒకటి తీసుకుని గుజ్జులా చేసుకోవాలి. అందులో చెంచా చొప్పున కొబ్బరి, ఆలివ్‌నూనె కలిపి తలకు పూతలా వేసుకోవాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేయాలి.

ఇలా వారానికి రెండుసార్లు చేస్తే హెయిర్‌ ఫాల్‌ తగ్గుతుంది. ఒక అరటిపండుని గుజ్జుగా చేసుకుని అందులో గుడ్డులోని తెల్లసొన, చెంచా నిమ్మరసం కలిపి బాగా మెత్తగా చేయాలి. దీనికి అరకప్పు పెరుగు కలిపి కుదుళ్ల నుంచి చివర్ల వరకూ అప్లై చేయాలి. దీన్ని 15 నిమిషాల పాటు ఆరనిచ్చి.. తలస్నానం చేస్తే సరి. పొడిబారిన జుట్టు పట్టుకుచ్చులా మారుతుంది.​ కప్పు అరటిపండు గుజ్జులో రెండు పెద్ద చెంచాల కలబంద గుజ్జు కలిపి తలకు పట్టించండి. ఆరాక తలస్నానం చేస్తే సరి. ఇందులోని పోషకాలు జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతాయి. మీకు హెయిర్‌ ఫాల్ ఎక్కువగా ఉంటే ఈ ప్యాక్‌ ఎంతో మేలు చేస్తుంది. వారానికి రెండు సార్లు ఈ ప్యాక్‌ అప్లై చేసుకుంటే.. జుట్టు రాలడం తగ్గి, దృఢంగా మారుతుంది.