Beauty Tips: అందమైన మెరిసే ముఖం కోసం.. అరటి పండుతో ఇలా చేయండి?

ప్రతి ఒక్కరు కూడా అందమైన ముఖం కావాలనే కోరుకుంటూ ఉంటారు. ఈ అందమైన ముఖం కోసం ఎన్నో రకాల బ్యూటీ ప్రోడక్టులు హోమ్ రెమెడీలను ఫాలో

  • Written By:
  • Publish Date - September 6, 2023 / 10:10 PM IST

ప్రతి ఒక్కరు కూడా అందమైన ముఖం కావాలనే కోరుకుంటూ ఉంటారు. ఈ అందమైన ముఖం కోసం ఎన్నో రకాల బ్యూటీ ప్రోడక్టులు హోమ్ రెమెడీలను ఫాలో అవుతూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు హోమ్ రెమెడీస్ అలాగే బ్యూటీ ప్రొడక్ట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. అందుకు గల కారణం వాటి ఉపయోగం ఎలాగో తెలియకపోవడమే. అయితే మీరు కూడా అందమైన మెరిసే ముఖాన్ని కోరుకుంటున్నారా. అయితే అరటి పండుతో ఈ విధంగా చేస్తే చాలు. మరి అరటి పండుతో ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అరటిపండు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది అన్న విషయం చాలామందికి తెలియదు. మొటిమలను తగ్గించడానికి అందాన్ని రెట్టింపు చేయడానికి, పట్టు లాంటి జుట్టు కోసం ఇలా చాలా రకాల వాటికి అరటిపండు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అరటిపండు చర్మంపై ముడుతులను తగ్గించడంతో పాటు, జిడ్డును కూడా తొలగిస్తుంది. అదేవిధంగా మొటిమలను కలిగించే బ్యాక్టీరియాని కూడా చంపేస్తుంది. అయితే ఇంట్లో అరటిపండుతో సహజమైన ఫేస్ మాస్క్ ట్రై చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. మరి ఫేస్ మాస్క్ ఎలా ట్రై చేసుకోవాలి అన్న విషయానికి వస్తే.. పొడి చర్మం ఉన్నవారికి ఒకలాంటి ప్రిపరేషన్ ఉంటుంది. జిడ్డు చర్మం ఉన్నవాళ్లకి ఒకలాంటి ఫేస్ ప్యాక్ ప్రిపరేషన్ ఉంటుంది.

ఇప్పుడు పొడి చర్మం ఉన్నవారికి బనానా ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా రెండు అరటి పండ్లను తొక్క తీసి మెత్తని ముద్దలాగా చేసి అందులో ఒక చెంచా తేని వేసి బాగా మిక్సీ చేసి ముఖానికి అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా చేయటం వలన మీ ముఖం కాంతివంతంగా తయారవుతుంది. అలాగే జిడ్డు చర్మం ఉన్నవారు అరటిపండు, దోసకాయని సమానంగా తీసుకొని రెండింటిని కలిపి మెత్తని పేస్టులా చేసుకోవాలి. తర్వాత ఆ మిశ్రమంలో కొన్ని బొప్పాయి పండు ముక్కలు వేసి దానిని పేస్టులాగా చేసి ముఖంపై మెడ భాగంలో అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత మోఖాన్ని చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా చేయడం చర్మంపై జిడ్డు సమస్య పోతుంది. పిగ్మెంటేషన్ సమస్యలను దూరం చేస్తుంది. అలాగే చర్మానికి అవసరమైన తేమను కూడా అందిస్తుంది..