Site icon HashtagU Telugu

Banana Chips: బ్రేకరీ స్టైల్ బనానా చిప్స్.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది అంతే!

Mixcollage 16 Jan 2024 03 54 Pm 5065

Mixcollage 16 Jan 2024 03 54 Pm 5065

మామూలుగా మనం బ్రేకరీ కి వెళ్ళినప్పుడు అక్కడ మనకు రకరకాల చిప్స్ లభిస్తూ ఉంటాయి. వాటిని ఎంత పర్ఫెక్ట్ గా ఇంట్లో ప్రయత్నించాలి అనుకున్నప్పటికీ బేకరీ స్టైల్ లో చేసినప్పటికీ అంత పర్ఫెక్ట్ గా మాత్రం రావు. కానీ వాళ్లు మాత్రం ఎంతో టేస్టీగా అందరికీ నచ్చే విధంగా తయారు చేస్తూ ఉంటారు. అలా బ్రేకరీలో ఎక్కువగా ఇష్టపడే వాటిలో బనానా చిప్స్ కూడా ఒకటి. మరి బేకరీ స్టైల్ లోనే బనానా చిప్స్ ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బనానా చిప్స్ కి కావాల్సిన పదార్థాలు :

పచ్చి అరటికాయలు – 2
రెడ్ చిల్లీ పౌడర్ – 1/4 స్పూన్
బ్లాక్ పెప్పర్ -1/4 స్పూన్
చాట్ మసాలా – 1/4స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
నూన్ – 2 స్పూన్స్
జీలకర్ర పొడి – చిటికెడు
ఆయిల్ – డీప్ ఫ్రై కి సరిపడా

బనానా చిప్స్ తయారీ విధానం:

ముందుగా అరటికాయల తొక్కలు తీయాలి. ఆపై వాటిని చిప్స్ కట్టర్ సహాయంతో ముక్కలు చేయాలి. ఇప్పుడు ఈ ముక్కలపై కొద్దిగా నూనె, పసుపు, ఉప్పు వేసి అన్నింటినీ మిక్స్ చేయాలి. ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్‌లో ఒక పొరలుగా పరచాలి. కొద్దిగా నూనెను చిలకరించి, 160 డిగ్రీల సెల్సియస్ వద్ద ఎయిర్ ఫ్రై చేయాలి. చిప్స్ కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు, వాటిపై కారంపొడి, చాట్ మసాలా, నల్ల మిరియాలు, జీలకర్ర పొడి చల్లి ఈ గిల్ట్ ఫ్రీ స్నాక్‌ని మిక్స్ చేయండి. అంతే టేస్టీగా ఉండే సింపుల్ బనానా చిప్స్ రెడీ.