Site icon HashtagU Telugu

Bald Head : బట్టతల సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా చేస్తే చాలు ఆ సమస్యకు చెక్ పెట్టాల్సిందే?

Mixcollage 25 Jan 2024 02 46 Pm 5699

Mixcollage 25 Jan 2024 02 46 Pm 5699

ఈ రోజుల్లో చాలామంది పురుషులు బట్టదల సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. చిన్న వయసులోనే బట్టతల వచ్చి ఎక్కువ ఏజ్ ఉన్న వారిలా కనిపిస్తూ ఉంటారు. దీంతో కొంతమందికి పెళ్లిళ్లు కూడా కావు. అంతేకాకుండా ఈ బట్టతలతో ఎన్నో రకాల ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. వయసు మళ్లిన వాళ్లలో బట్ట తల వస్తే పెద్దగా ప్రమాదం ఏం లేదు కానీ,చిన్న వయసులోనే బట్ట తల వస్తే మాత్రం చాలా కష్టం. ఇక బట్టతలపై వెంట్రుకలు రావడం కోసం చాలామంది మార్కెట్లో దొరికే ఎన్నో రకాల హెయిర్ ఆయిల్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు.

కొంతమంది మెడిసిన్స్ ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయినప్పటికీ బట్ట తలపై జుట్టు రాలేదని దిగులు చెందుతూ ఉంటారు. అయితే ఇక మీదట అలా బాధపడాల్సిన పనిలేదు. ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు పాటిస్తే చాలు బట్టతలపై జుట్టు తిరిగి రావడం ఖాయం. మరి అందుకోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే.. మీకు మామిడి టెంక తెలిసే ఉంటుంది. మామిడి పండును తిన్నాక వచ్చే టెంక. దాన్ని పగలగొట్టితే అందులో జీడి ఉంటుంది. మామిడి టెంక చాలా గట్టిగా ఉంటుంది. దాన్ని పగలగొట్టి అందులోని జీడి తీసి ఆ జీడిని ఎండబెట్టాలి. జీడి ఎండాక దాన్ని పొడిగా చేసి, తలకు రాసే ఏదైనా నూనెలో కలిపి బాగా మరగబెట్టాలి.

ఆ తర్వాత ఆ నూనెను చల్లార్చి రోజూ తలకు రాస్తూ ఉంటే త్వరలోనే బట్ట తల మీద జుట్టు వస్తుంది. అలాగే జుట్టు ఊడిపోవడం కూడా తగ్గుతుంది. చుండ్రు లాంటి సమస్యలు ఉన్నా తగ్గుతాయి. తెల్ల జుట్టు ఉన్నవాళ్లు కూడా ఈ విధంగా చేస్తే తెల్ల జుట్టు మటుమాయం అవుతుంది. ఒక్క ఈ విషయంలో మాత్రమే కాకుండా అందానికి కూడా ఈ పొడి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మామిడి జీడిగింజల పొడి వెన్న రెండు కలిపి చర్మంపై అప్లై చేసి కొద్దిసేపటి తర్వాత ముఖం శుభ్రంగా కడుక్కుంటే చర్మ మృదువుగా మారుతుంది. కేవలం అందానికి మాత్రమే కాకుండా ఈ మామిడి జీడి పొడి ఆరోగ్యానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఈ పొడిని తేనెతో కూడా కలిపి తినవచ్చు. విరోచనాలు తగ్గి బీపీ కంట్రోల్ లో ఉంటుంది. మధుమేహం ఉన్న వాళ్లు కూడా జీడి గింజలను తినవచ్చు. అయితే మామిడి జీడి పొడిని మోతాదుకు మించి తినకూడదు. ఎక్కువ తింటే లేనిపోని సమస్యలు వస్తాయి. రోజుకు ఒక గ్రాము పొడి కంటే ఎక్కువ తినకూడదు.