Bad Breath Treatment: నోటి దుర్వాసన ఎలా పోతుందంటే..?

చాలా మంది నోటి దుర్వాసనతో బాధపడుతుంటారు. ఈ సమస్య ఉన్నవాళ్ల కారణంగా పక్కవారూ ఇబ్బంది పడుతుంటారు. ఇంతకీ ఈ ప్రాబ్లమ్ ఎందుకు వస్తుంది.. ? అది వస్తే ఏం చేయాలి.. ? ఇప్పుడు తెలుసుకుందాం..!

  • Written By:
  • Publish Date - February 3, 2023 / 02:12 PM IST

చాలా మంది నోటి దుర్వాసన (Bad Breath)తో బాధపడుతుంటారు. ఈ సమస్య ఉన్నవాళ్ల కారణంగా పక్కవారూ ఇబ్బంది పడుతుంటారు. ఇంతకీ ఈ ప్రాబ్లమ్ ఎందుకు వస్తుంది.. ? అది వస్తే ఏం చేయాలి.. ? ఇప్పుడు తెలుసుకుందాం..!

● నోటి దుర్వాసన కారణాలు

◆ తక్కువ నీళ్లు తాగే వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
◆దీర్ఘకాల నోటి వ్యాధుల వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంటుంది.
◆ ఆహారాల్లో ఉండే దుర్వాసన గల నూనెలు.. ఊపిరితిత్తులకు చేరినప్పుడు కూడా నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది.
◆ నిద్రలేచిన తరువాత ఎక్కువ సమయం దాకా మాట్లాడకుండా ఉన్నప్పుడు, ఆహారాన్ని ఎక్కువ సమయం దాకా తీసుకోకుండా ఉన్నప్పుడు లాలాజలం విడుదల తగ్గి నోటిలో దుర్వాసన సమస్య తలెత్తుతుంది.
◆ఉదయం, రాత్రి భోజనం తరువాత దంతాలను తోమాలి. తద్వారా దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఇలా చేయకపోవడం వల్ల నోట్లో స్మెల్ వస్తుంటుంది.
◆ కొవ్వు పదార్థాలు, ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసం, కోడిగుడ్లు, టీ ఇంకా కాఫీ వంటి పదార్థాలను తీసుకున్నప్పుడు కూడా నోటి దుర్వాసన అనేది ఎక్కువగా వస్తుంది.

● నోటి దుర్వాసనపై పోరాడే ఫుడ్స్ ఇవీ

గ్రీన్ టీ: గ్రీన్ టీలో కాటెచిన్ అనే ఎనర్జిటిక్ యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది నోటి దుర్వాసన కలిగించే సల్ఫర్ సమ్మేళనాలను తగ్గించడం ద్వారా నోటిలో బ్యాక్టిరియాను నిరోధిస్తుంది.

విటమిన్ సి ఫ్రూట్స్: నిమ్మ, దానిమ్మ, యాపిల్, బత్తాయి, నారింజ వంటి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి బ్యాక్టిరియాను కంట్రోల్ చేయడానికి మాత్రమే కాకుండా.. చిగుళ్ల వ్యాధులు, చిగురువాపుతో పోరాడటానికి సహాయపడుతాయి.

పెరుగు: పెరుగులో ప్రో బయోటిక్స్ ఉంటాయి. ఇది దుర్వాసన కలిగించే బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. పెరుగులో విటమిన్ డి కూడా పుష్కలంగా ఉండటంతో శరీరంలో క్రిములు పెరగడాన్ని తగ్గిస్తుంది.

తులసి: తులసిలోని పాలీఫెనాల్స్ అనే సహజ అణువులు నోటి దుర్వాసనను తగ్గిస్తాయి. తులసిని ఏ విధంగా తీసుకున్నా.. నోటి దుర్వాసనను తగ్గిస్తుంది.

◆ అల్లం: అల్లంలో ఉండే 6-జింజెరాల్ నోటిలోని సల్ఫర్ సమ్మేళనాల విచ్ఛినానికి సహాయపడే లాలాజల ఎంజైమ్ ను ఇస్తుంది. అల్లం లేదా అల్లం ఉపయోగించిన పదార్థాలను తీసుకుని నోటి దుర్వాసనను కంట్రోల్ చెసుకోవచ్చు.

◆నిమ్మకాయ రసం: నోటి నుంచి బ్యాడ్‌ స్మెల్‌ వస్తే వెంటనే నీరు తాగండి. వీలుంటే నీటిలో నిమ్మకాయ రసం వేసి తాగితే ఇంకా మంచిది.

◆సోంపు: భోజనం చేసిన తరువాత టీస్పూన్‌ సోంపు తిన్నా నోటి దుర్వాసన తగ్గి, నోరు ఫ్రెష్‌ అవుతుంది. భోజనం చేశాక ఒకటి రెండు పుదీనా లేదా తులసి ఆకులను అలాగే పచ్చిగా నమిలేయాలి. దీంతో నోటి దుర్వాసన సమస్య నుంచి బయట పడవచ్చు.

◆ వేప, చండ్ర: వేప, చండ్ర ఇంకా అలాగే తుమ్మ వంటి చెట్టు పుల్లలతో దంతాలను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ లు ఈజీగా తగ్గి నోటి దుర్వాసన రాకుండా ఉంటుంది. లవంగాలను చప్పరించడం వల్ల కూడా ఈ సమస్య నుండి చాలా ఈజీగా బయటపడవచ్చు.

◆ దోర జామకాయ: దోర జామకాయను దంతాలతో కొరికి నమిలి తినడం వల్ల కూడా నోటి దుర్వాసన సమస్య చాలా ఈజీగా తగ్గుతుంది.

◆ సోంపు, జీలకర్ర, ఏలక్కాయ: సోంపు, జీలకర్ర, ఏలక్కాయ, దాల్చిన చెక్క వంటి వాటిని వక్కపొడిలా చేసుకుని నములుతూ ఉంటే నోటి ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు దుర్వాసన సమస్య కూడా తగ్గుతుంది.