Ayurveda Tips on Snoring: గురకను వదిలించుకునే సులువైన మార్గాలు..!

గురక (Snoring).. ఈ ప్రాబ్లమ్ ఎంతోమందికి ఉంటుంది. దీన్ని కొంతమంది గాఢ నిద్రకు చిహ్నంగా భావిస్తారు. ఇంకొంతమంది పెద్ద సమస్యగా చెబుతారు. నిద్రపోతున్న వ్యక్తికి గురకవల్ల సమస్య ఉన్నా, లేక పోయినా.. పక్కన ఉండే వారికి మాత్రం గురక సౌండ్ తో ఇబ్బంది ఉంటుంది.

  • Written By:
  • Publish Date - February 24, 2023 / 06:25 AM IST

గురక (Snoring).. ఈ ప్రాబ్లమ్ ఎంతోమందికి ఉంటుంది. దీన్ని కొంతమంది గాఢ నిద్రకు చిహ్నంగా భావిస్తారు. ఇంకొంతమంది పెద్ద సమస్యగా చెబుతారు. నిద్రపోతున్న వ్యక్తికి గురకవల్ల సమస్య ఉన్నా, లేక పోయినా.. పక్కన ఉండే వారికి మాత్రం గురక సౌండ్ తో ఇబ్బంది ఉంటుంది. గురకను తేలిగ్గా తీసుకుంటున్నప్పటికీ అది కొన్ని ఆరోగ్య సమస్యలకు సంకేతం అని చెప్పొచ్చు.

■ గురక ఎందుకు వస్తుంది..?

★ నిద్రపోతున్నప్పడు ముక్కు నుంచి గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్లే మార్గంలో అడ్డంకులు ఏర్పడిన సమయంలో గురక వస్తుంది. గురక వచ్చినప్పుడు నోటి ద్వారా శ్వాస తీసుకుంటారు. ఆ మార్గంలోనూ అవాంతరాలుంటే అప్పుడు కుచించుకుపోయిన మార్గం నుంచి గాలి వెళ్లాల్సి ఉండడంతో చుట్టుపక్కల ఉన్న కణజాలాలు కదలికకు గురై చప్పుళ్లు వస్తాయి. వాయు నాళాలు తక్కువ వ్యాకోచంతో ఉండటం వల్ల మెడ, గొంతు భాగంలో అధిక బరువు పడి గురకకు దారితీస్తుంది.
★ గాఢ నిద్రలో ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడం, వదలడం జరిగే క్రమంలో మెడకు చెందిన మృదువైన టిష్యూ కంపిస్తుంది. ఫలితంగా గురక వస్తుంది. ఈ మృదువైన టిష్యూ మన ముక్కులో టాన్సిల్, నోటిలో పైభాగంలో ఉంటుంది. నిద్రలో శ్వాస తీసుకోవడం, వదిలే సమయంలో బలం ఉపయోగించాల్సి ఉంటుంది. ఆ సమయంలో టిష్యూలో విచిత్రమైన వైబ్రేషన్ ఉంటుంది. ఫలితంగా గురక తప్పదు.

■ గురకకు ఇతర కారణాలు?

★ మద్యం సేవించడం, సిగరెట్‌ స్మోకింగ్‌, ట్రాంక్విలైజర్‌ ఔషధాల వాడకంతో గురక వస్తుంది.
★ మానసికపరమైన ఒత్తిడి, కంగారు, విపరీతమైన ఆలోచనాధోరణి కూడా గురకకు ఒక కారణం.
★ ముఖ్యంగా అధిక బరువు ఉన్నవారికి కచ్చితంగా గురక వస్తుంది.

■ గురకకు చెక్ పెట్టే అలవాట్లు

★ సాధారణంగా వీపు ఆన్చి పడుకునేవారిలో గురక సమస్య అధికంగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో గురక రాకుండా ఉండాలంటే..స్లీపింగ్ పొజిషన్ మార్చాలి. ఓ పక్కకు తిరిగి పడుకోవడం మంచి అలవాటు.

★ పడుకునేటప్పుడు తల భాగం ఎత్తులో ఉండేలా చూసుకోవాలి.

★ ముక్కు మూసుకుపోకుండా శుభ్రంగా ఉంచుకోవాలి.

■ గురకకు చెక్ పెట్టే ఫుడ్ ఐటమ్స్

★ రోజూ నిద్రపోయే ముందు గుప్పెడు పచ్చి అటుకులను తినడం వల్ల గురకను అదుపులో పెట్టుకోవచ్చు.

★ అర టీ స్పూన్‌ తేనె, అర టీ స్పూన్‌ ఆలివ్ ఆయిల్‌ కలిపి నిద్రపోయే ముందు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

★ గ్లాసు నీటిలో రెండు పిప్పర్‌మెంట్‌ ఆయిల్‌ చుక్కలు వేసి నోట్లో వేసుకుని బాగా పుక్కిలించాలి.

★ గ్లాసెడు వేడి నీటిలో అర టీ స్పూన్‌ యాలకుల పొడి కలిపి పడుకునే ముందు తాగాలి.

★ ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న పసుపు.. గురక సమస్యకు మేలు చేస్తుంది. అంతేకాదు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. గురక సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. మీరు ఈ సమస్య నుండి బయటపడాలంటే.. రాత్రి పడుకునే ముందు పసుపు పాలు తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది.