Site icon HashtagU Telugu

Bad Dreams : చెడు కలలు రాకుండా ఉండాలంటే ఏమి చేయాలో తెలుసా?

Sleeping Less Effects

Sleeping Less Effects

మనిషి ఆరోగ్యంగా(Health) ఉండాలంటే మంచి నిద్ర(Sleep) అనేది అవసరం. ఒకరోజు సరైన నిద్ర లేకపోయినా మనకు తలనొప్పి, వికారం, వాంతులు, కళ్ళు మంటలు.. వంటివి వస్తుంటాయి. మనకు నిద్ర పోయినప్పుడు కలలు వస్తుంటాయి. అయితే చెడు కలలు(Bad Dreams) వస్తే మనకు సరిగ్గా నిద్ర పట్టదు. అందుకే చెడు కలలు రాకుండా ఎంతో హాయిగా నిద్ర పోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనకు చెడు కలలు రావడానికి ముఖ్యంగా మన చుట్టూ ఉండే వస్తువులు, మనం నిద్రించే స్థలం మరియు మనకు ఆ రోజు జరిగిన సంఘటనలు కారణం అవుతాయి.

మనకు చెడు కలలు రాకుండా ఉండడానికి కర్పూరాన్ని మనం పడుకునే ముందు మన కాళ్ళ దగ్గర మంచం మీద పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మనకు చెడు కలలు రావడం తగ్గుతాయి. మనం పడుకునే గదిని ఉప్పు నీళ్ళతో తుడిస్తే ఆ గదిలో నెగిటివ్ ఎనర్జీ పోతుంది, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది దీని వలన మనకు చెడు కలలు రాకుండా ఉంటాయి. బెడ్ రూమ్ లో వాడే బెడ్ షీట్స్, కర్టైన్స్ కలర్ లేత నీలం రంగువి వాడితే మంచిది. వీటి కలర్స్ కూడా మన కలలను ప్రభావితం చేస్తాయి.

నిద్రలో ఉన్నప్పుడు పిల్లలు ఎక్కువగా ఏడుస్తుంటే రాగితో చేసిన చైన్ వారి మెడలో వేయాలి. ఇలా చేయడం వలన చెడు కలలు రాకుండా ఉంటాయి. పిల్లల దగ్గరకు నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. మనం పడుకునే ముందు మనం అన్నింటి గురించి ఆలోచిస్తూ ఉంటాము. దీని వలన కూడా మనకు ప్రశాంతమైన నిద్ర అనేది లభించదు. కాబట్టి పడుకునే ముందు దేని గురించి ఆలోచించకుండా మెలోడీ నచ్చిన మ్యూజిక్ ని వింటూ పడుకుంటే మంచి నిద్ర పడుతుంది. ఎలాంటి చెడు కలలు రాకుండా ఉంటాయి.

 

Also Read : Vrikshasana : వృక్షాసనం చేయడం వలన కలిగే ప్రయోజనాలు..