మన భారతదేశంలో అన్ని రకాల వంటలలో ఏదో ఒక రకమైన మసాలా దినుసులు(Spices) వాడుతుంటాము. కాబట్టి వాటి వలన ఆహారపదార్థాలు ఎంతో రుచికరంగా మారతాయి. అందుకోసం మనం అన్ని వంటకాలలో మసాలా పదార్థాలను వేసుకుంటూ ఉంటాము. కానీ ఎండాకాలంలో(Summer) మనం మసాలా పదార్థాలను ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే వాటి వలన మన ఆరోగ్యం దెబ్బతింటుంది. మనం మామూలుగా అన్ని వంటకాలలో తాలింపులలో ఎండుమిర్చి వాడుతుంటాము. కానీ ఎండాకాలంలో ఎండుమిర్చి తక్కువగా వాడాలి. లేకపోతే కడుపులో మంట, ఛాతిలో నొప్పి, గొంతు మంట వంటివి వస్తాయి.
మన అందరికీ తెలుసు శీతాకాలంలో మన శరీరంలో వేడిని పెంచడానికి మనం వెల్లుల్లిపాయలు ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాము. కానీ ఎండాకాలంలో వెల్లుల్లిపాయలను ఆహారంలో తక్కువగా తీసుకోవాలి. లేకపోతే మన శరీరంలో వేడి పెరుగుతుంది, ఇంకా యాసిడ్ రిఫ్లెక్స్ ప్రమాదాన్ని పెంచుతుంది. అల్లం మనం టీలో కూడా వేసుకుంటూ ఉంటాము. ఇది మన శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచుతుంది. అల్లం ఎండాకాలంలో ఎక్కువగా ఉపయోగిస్తే మన గుండెల్లో మంట, విరోచనాలు వంటి సమస్యలు వస్తాయి. అల్లం కూడా ఎండాకాలంలో చాలా తక్కువగా ఉపయోగించుకోవాలి.
మిరియాలు కూడా ఎండాకాలంలో తక్కువగా తినాలి లేకపోతే ఎసిడిటీ, మలబద్దకం వంటివి వస్తాయి. మసాలా దినుసులు కూడా ఆహారంలో తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఎండాకాలంలో మసాలా పదార్థాలను తీసుకోవడం తగ్గించాలి. లేకపోతే మన శరీర ఉష్ణోగ్రత పెరగడం, ఉదర సంబంధ సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అల్లం, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, మసాలా దినుసులు, మిరియాలు వంటివి ఎండాకాలంలో ఎక్కువగా తినకూడదు. అలాగే బయట కూడా మసాలా ఫుడ్స్ అస్సలు తినకూడదు ఎండాకాలంలో.
Also Read : Summer: వేసవికాలంలో ఈ 5 విషయాలతో మీ కారుని రక్షించుకోండిలా?