Site icon HashtagU Telugu

Good Sleep : హాయిగా నిద్రపోవాలంటే…వీటికి దూరంగా ఉండండి..!!

Sleep Position

Sleep Position

ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాహారమే ఒక్కటే సరిపోదు..కంటినిద్రా ఉండాల్సిందే. హాయిగా నిద్రపోవాలంటే సరైన జీవన విధానాన్ని అలవరచుకోవాలి. దీంతోపాటు మనం ప్రతిరోజూ తీసుకునే ఆహారంపై కూడా శ్రద్ధపెట్టాల్సిందే. మనం తీసుకునే ఆహారమే…మన ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ప్రతిఒక్కరూ  రోజుకు 7 నుంచి 8 గంటలపాటు తప్పకుండా నిద్రపోవాలి. అప్పుడే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. అయితే రాత్రి హాయిగా నిద్రపోవాలంటే కొన్ని ఆహారపదార్థాలకు తప్పకుండా దూరంగా ఉండాల్సిందే. అవేంటో చూద్దాం.
కాఫీ, టీ జోలికి అస్సలు వెళ్లకూడదు:
రాత్రి కంటి నిండా నిద్రపట్టాలంటే …కాఫీ టీలకు దూరంగా ఉండాలి. పడుకునే ముందుకు కెఫిన్ పదార్థాలకు దూరంగా ఉండాలి. వీటిని తీసుకున్నట్లయితే సరిగ్గా నిద్రపట్టదు.
పిండి పదార్థాలకు దూరంగా:
బ్రౌన్ రైస్, పాస్తా, బ్రెండ్ వంటి వాటికి దూరంగా ఉండాలి. ఇవి తింటే రాత్రి సరిగ్గా నిద్రపట్టదు.
బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి:
శరీరానికి సరిపడా ఆహారం తీసుకోవాలి. లేదంటా రాత్రి నిద్రపట్టదు. మనం తీసుకునే ఆహారం ఎప్పుడూ కూడా బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ప్రొటీన్స్, ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
నీళ్లు తాగాలి:
రాత్రిపడుకునే ముందు కాకుండా రోజుకు ఎనిమిది నుంచి పది గ్లాసుల నీళ్లు తాగాలి. అలా తాగితేనే ఆరోగ్యం బాగుంటుంది. లేదంటే డీహైడ్రేషన్ సమస్యలతోపాటు మరెన్నో సమస్యలు ఇబ్బంది పెడతాయి.
Exit mobile version