Site icon HashtagU Telugu

Face Mask Mistakes: మీరు కూడా ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నారా.. అయితే ఈ 4 తప్పులు అస్సలు చేయకండి?

Mixcollage 21 Jan 2024 05 04 Pm 5282

Mixcollage 21 Jan 2024 05 04 Pm 5282

మామూలుగా స్త్రీ, పురుషులు ముఖానికి ఎన్నో రకాల ఫేస్ ప్యాక్ లు ట్రై చేస్తూ ఉంటారు. పురుషులతో పోల్చుకుంటే స్త్రీలు ఎక్కువగా ముఖం అందంగా కనిపించడం కోసం ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు,ముడతలు వంటివి పోగొట్టుకోవడం కోసం రకరకాల ఫేస్ ప్యాక్ లు ట్రై చేస్తూ ఉంటారు. ఎక్కువమంది బ్యూటీకేర్‌ రొటీన్‌ ఫేస్‌ మాస్క్‌లు ఫాలో అవుతూ ఉంటారు. కొందరు రకరకాల బ్యూటీ ప్రోడక్ట్లతో ఫేస్ ప్యాక్ లు ట్రై చేస్తే మరి కొందరు సహజమైన ఫేస్ ప్యాక్ లు ట్రై చేస్తూ ఉంటారు. అయితే ఫేస్ ప్యాక్ లో వేసుకోవడం మంచిదే కానీ, కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదు. ముఖ్యంగా మీరు ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు ఈ నాలుగు రకాల తప్పులు అస్సలు చేయకండి.

ఇంతకీ ఆ నాలుగు రకాల తప్పులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కొత్తరకం ఫేస్‌మాస్క్‌ అప్లై చేసేముందు ప్యాచ్‌ టెస్ట్‌ కచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే దానిలో పదార్థాలు అరెర్జీ, చికాకు కలిగించవచ్చు. మీరు ఫేస్‌ప్యాక్‌ అప్లై చేసేముందు ఏదైనా ప్రాంతంలో ప్యాచ్‌ టెస్ట్‌ చేయడం తప్పనిసరి. కొంతమంది అందంగా కనిపించాలని తరచూ ఫేస్‌ ఫ్యాక్స్‌ చేస్తుంటారు. అయితే వీటిని తరచుగా అప్లై చేస్తే ఓవర్ ఎక్స్‌ఫోలియేషన్ అవుతుంది. దీని కారణంగా చర్మం పొడిబారుతుంది. కొన్నిసార్లు చికాకు కూడా కలిగిస్తుంది. ఓవర్-ఎక్స్‌ఫోలియేషన్ చర్మాన్ని సున్నితంగా మారుస్తుంది. కొంతమంది ముఖం శుభ్రం చేసుకోకముందే ఫేస్‌ప్యాక్‌‌‌‌‌ అప్లై చేస్తుంటారు. మీ ముఖాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోకుండా ప్యాక్‌ అప్లై చేస్తే ఉత్పత్తి సమర్థవంతంగా చర్మంలోని వెళ్లదు.

దీనివల్ల ప్యాక్‌ ఎఫెక్టివ్‌ గా పనిచేయదు. ఏదైనా ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవడం తప్పనిసరి. కొందరు ఫేస్‌ప్యాక్‌ అప్లై చేసి ఎక్కువసేపు ఆరనిస్తారు. ఇలా చేస్తే చర్మానికి చికాకు కలిగిస్తుంది. అంతేకాదు, చర్మంలోని సహజ నూనెలు కోల్పోతాయి. కొన్ని కొన్ని సార్లు వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావచ్చు. కాబట్టి ఎటువంటి ఫేస్ ప్యాక్ వేసినా కొంచెం డ్రై అవ్వగానే వెంటనే ముఖాన్ని కడిగేసుకోవడం మంచిది.

Exit mobile version