Atukula Dosa: ఎంతో టేస్టీగా ఉండే అటుకుల దోస.. సింపుల్ గా ట్రై చేయండిలా?

మామూలుగా మనం ఉదయం సమయంలో బ్రేక్ ఫాస్ట్ గా దోసను తింటూ ఉంటాం. ఈ దోసలో ఎన్నో రకాల దోశలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ప్లేన్ దోస,

Published By: HashtagU Telugu Desk
Mixcollage 19 Jan 2024 08 17 Pm 9820

Mixcollage 19 Jan 2024 08 17 Pm 9820

మామూలుగా మనం ఉదయం సమయంలో బ్రేక్ ఫాస్ట్ గా దోసను తింటూ ఉంటాం. ఈ దోసలో ఎన్నో రకాల దోశలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ప్లేన్ దోస, ఆనియన్ దోస, మసాలా దోస, పెసరట్టు దోస, ఉప్మా దోస, కారం దోస, ఉల్లి దోస, ఇలా ఎన్నెన్నో వెరైటీస్ ని ట్రై చేసె ఉంటాం. అయితే ఎప్పుడైనా అటుకుల దోస తిన్నారా. తినకపోతే ఈ సింపుల్ రెసిపీ ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అటుకుల దోసకు కావలసిన పదార్థాలు

అటుకులు – అర కిలో
మజ్జిగ – ఒక కప్పు
బియ్యం – అర కిలో
పచ్చిమిర్చి -10 గ్రా
జీలకర్ర – 2 చెంచాలు
తినే సోడా – చిటికెడు
నూనె – పావు కిలో
ఇంగువ – తగినంత
ఉప్పు – తగినంత

అటుకుల దోస తయారీ విధానం:

ముందుగా మజ్జిగని ఒక గిన్నెలోకి తీసుకుని కడిగిన అటుకుల్ని మజ్జిగలో నానపెట్టాలి. బియ్యం నీళ్ళలో నానేయాలి. బియ్యం బాగా నానిన తర్వాత అటుకులు, బియ్యం కలిపి మెత్తగా రుబ్బుకొని, పచ్చిమిర్చి, జీలకర్ర, ఇంగువ, తినేసోడా వేసి బాగా కలపి కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి పెనం పెట్టి ఈ పిండితో దోసె వేసుకుని పైన నూనె వేసిరెండువైపులా కాల్చుకోవాలి. అంతే రుచికరమైన అటుకుల దోస రెడీ.

  Last Updated: 19 Jan 2024, 08:17 PM IST